హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలీనా జోలీ సినీ కెరీర్ నుండి త‌ప్పుకున్నాక ఇంటి వ్వవ‌హారాలే చక్కబట్టుకుంటుంది. ప‌లు సంవ‌త్సరాలుగా హాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా ప్రేక్షకుల‌ను ఇట్టే ఆక‌ట్టుకున్న జోలీ, హీరోల‌కు ధీటుగా సినిమాల్లో అద‌ర‌గొట్టింది.

ఇప్పుడు ఈ హాలీవుడ్ లెజెండ్ ఆరోగ్య ప‌రిస్థిలు విషమించేలా ఉంది. త‌న‌ను క్యాన్సర్ మ‌హ‌మ్మారి ప‌ట్టుకుంది. జోలీకు 87 శాతం బ్రెస్ట్ క్యాన్సర్‌, 50 శాతం ఓవ‌రీన్ క్యాన్స్‌ర్ తో బాధ‌ప‌డుతుంది. ఇప్పుడు శ‌స్త్ర చికిత్స ద్వార రెండు స్థన‌ముల‌ను తొల‌గించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ఏంజెలీనా జోలీకు 37 సంవ‌త్సరాలు. త‌న తల్లి కూడ ఓ హాలీవుడ్ న‌టే. ఆమె కూడ ఓవ‌రీన్ క్యాన్సర్‌తో 36 సంవ‌త్సరాల‌కే చ‌నిపోయింది. ఇప్పుడు అదే ప‌రిస్థతి ఏంజెలీనాకు రావ‌డంతో అభిమానులు ఆందోల‌న ప‌డుతున్నారు. ఆయితే ఇప్పుడు త‌న రెండు స్థన‌ముల‌ను తొల‌గించిన‌ వైధ్యులు కృత్రిమ స్థన‌ముల‌ను ఏర్పాటు చేయ‌డంతో ప‌రిస్థితి చ‌క్కబ‌డింది.

ఏంజెలీనా జోలీ నటించిన యాక్షన్ సినిమా సాల్ట్‌లో తొలుత టామ్ క్రిస్టన్ నటించాల్సి ఉంది. డే అండ్ నైట్ సినిమాకు కమిట్ కావడంతో సాల్ట్‌లో నటించలేకపోయాడు. అతనికి బదులు ఎవరిని ఎంపిక చేద్దామని ఆలోచించిన నిర్మాతలు జోలీని తీసుకున్నారు. దీనిని బట్టి జోలీ నటనా ప్రాముఖ్యమేంటో అర్థం చేసుకోవచ్చు.2005 నుంచి జోలీ బ్రాడ్ పిట్‌తో కలిసి జీవిస్తున్నారు. జోలీ-బ్రాడ్ పిట్ దంపతులకు ఆరుగురు పిల్లలున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులను జోలీ దత్తత తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: