కాజ‌ల్....టాలీవుడ్ నుండి బాల‌వుడ్ దాకా త‌న అందంతో కుర్రకారుకి కిర్రెక్కించిన సుందరి. అయితే అది నిన్నటిమాట‌. ఇపుడు కాజ‌ల్ లో  స‌డ‌న్ గా చాలా మార్పు వ‌చ్చింది. బాడీలో వ‌చ్చిన మార్పుతో పాటు ఆమె బిహేవియ‌ర్ లో కూడా మార్పు వ‌చ్చింద‌ట‌. వున్నట్టుండి త‌న రెమ్యూన‌రేష‌న్ అమాంతం పెంచేసింద‌ట‌. ప్రస్తుతం అమ్మడు న‌టించిన ఏ సినిమా పెద్ద హిట్ అయిన దాఖ‌లాలు లేన‌ప్పటికీ స‌డ‌న్ గా పారితోషికం పెంచ‌డ‌మే కాకుండా చిన్న నిర్మాత‌ల‌ను గుమ్మం అవ‌త‌లే నిల‌బెట్టి  కాల్షీట్స్ ఖాళీ లేవంటూ తిప్పి పంపేస్తోంద‌ట‌.
దీంతో నిన్నటిదాకా ఆమె కోటి రూపాయ‌లు అడిగినా నోరు మెద‌ప‌కుండా ఇచ్చిన నిర్మాత‌లు..కాజ‌ల్ కోటిపైనే డిమాండ్ చేస్తుండ‌టంతో మారు మాట్లాడ‌కుండా వెనుదిరిగి వెళ్తున్నార‌ట‌. నిజానికిఇ ఇలాగే గ‌బ్బర్ సింగ్2లో వ‌చ్చిన అవ‌కాశాన్ని చేజార్చుకుంద‌ట‌. ఈ సినిమానే కాదు మ‌రో రెండు మూడు సినిమాల్ని కూడా ఇలా అతి చేసి వ‌దులుకుంద‌ని స‌మాచారం.
రోజుకో హీరోయిన్ వ‌స్తున్న ఈ రోజుల్లో ....అందులోనూ అర‌కోటిలో అదిరిపోయే అందం ,అభిన‌యం ప్రద‌ర్శించే భామ‌లు దొరుకుతున్న ఈ స‌మ‌యంలో  ...ఆంటీలా త‌యారైన కాజ‌ల్ కు అంత ఇవ్వడం దండ‌గ‌ని కొంద‌రు నిర్మాత‌లు భావిస్తున్నార‌ట‌. ఆ ప్రాసెస్ లోనే ఏదైనా హీరో కాజ‌ల్ ని హీరోయిన్ గా పెట్టుకుందామా అంటే ఆమె తతంగం అంతా చెప్తున్నార‌ట‌. సో కాజ‌ల్ ఇదే బిహేవియ‌ర్ కొన‌సాగిస్తే చెన్నై చంద్రం త్రిష‌, డీల్లీ డాల్ శ్రేయలాగే  ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవ‌డం ఖాయ‌మంటున్నారు ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: