మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం స్టోరీ కథాంశంగా ఓ స్టోరి రెడీ అయింది. ఇందులో దావూద్ ల‌వ‌ర్‌గా సోనాక్షి న‌టించింది. ఆ మూవీనే ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్ అగైన్‌. ఈ మూవీను ఒన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబాయ్ మూవీకు సీక్వెల్‌గా తెర‌కెక్కింది. ఒరిజిన‌ల్ మూవీలో అజ‌య్‌దేవ‌గ‌న్ హీరోగా చేస్తే, సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్ చేస్తున్నాడు. మొద‌టి మూవీ సూప‌ర్ డూప్ హిట్ కావ‌డంతో సీక్వెల్ పై స్టోరీను మ‌రింత స్ట్రాంగ్ మ‌లిచారు.

సీక్వెల్ పార్ట్‌ మొత్తం అండ‌ర్ వ‌రల్డ్ మాఫిగా మార్చారు. అచ్చంగా చెప్పాలంటే ఈ స్టోరి ప‌క్కా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంద‌ని బ‌య‌ట‌కు వ‌చ్చిన టాక్‌. దావూద్‌గా అక్షయ్‌కుమార్ చేస్తుంటే, దావూద్ గ‌ర్గ్‌ప్రెండ్‌గా సోనాక్షి చేసింది. దావూద్ గ‌ర్ల్ ప్రెండ్ మోనికా బేడి అయితే మోనికా బేడి అస‌లు పేరు యాస్మిన్ మిర్జా.

మూవీలో సోనాక్షికు యాస్మిన్ మీర్జా అనే పేరు పెట్టారు. త‌రువాత బదిరింపులు రావ‌డంతో యాస్మిన్ మీర్జా పేరును జాస్మిన్ మీర్జాగా మార్చారు. ఈ విధంగా సోనాక్షి పేరు జాస్మిన్‌గా మారిపోయింది. ఇది దావూద్ స్టోరి కావ‌డంతో ఇందులో చాలా సీన్లను తొల‌గించే అవ‌కాశం ఉంద‌ని బి టౌన్ సైతం చెప్పుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: