సోన‌మ్‌క‌పూర్‌,ధ‌నుష్ న‌టించిన రాంజ్‌నా చిత్రం 5 కోట్ల 15 ల‌క్షల రూపాల‌య‌ల‌ను వ‌సూల్ చేసింది. ఇది మొద‌టి రోజు క‌లెక్షన్స్ వివరాలు. ఈ క‌లెక్షన్స్‌తో ధ‌నుష్ మార్కెట్ బాలీవుడ్ పై స్పష్టంగా తెలిసింది. ధ‌నుష్ బాలీవుడ్ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటాడో లేదో అనుకున్న క్రిటిక్స్‌కు గ‌ట్టిగానే స‌మాధానం చెప్పాడు.

ఈ మూవీకు మొద‌టి నుండి పాజిటివ్ ప్రమోష‌న్ తొడ‌వ‌డంతో రాంజ్‌నా మూవీ మొద‌టి రోజు క‌లెక్షన్స్ అంద‌రిని అబ్బుర‌ప‌రిచాయి. ఈ మ‌ధ్య వ‌చ్చిన మూవీల్లో ఆషికి 2, ఫ‌క్రే, త‌రువాత రాంజ‌నా మూవీల‌కు ఇంత‌టి భారీ క‌లెక్షన్స్ వ‌చ్చాయి. ఈ మూడు మూవీల్లోని ఆర్టిస్టులు కొంత మంది న్యూ ఫేసెస్ అయినా, బాలీవుడ్ బాక్సాపీస్ షేక్ చేయ‌గ‌లిగారు.

రాంజ్‌నా స‌క్సెస్ కావ‌డంతో, వీరిద్దరి కాంబినేష‌న్‌లో మ‌రో మూవీకు రంగం సిద్దం అవుతుంది. ధ‌నుష్ సెకండ్ మూవీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ప్పటికి అందులో హీరోయిన్‌గా ఇంకా ఎంపిక జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు ఆ మూవీలోకి సోన‌మ్‌క‌పూర్‌ని తీసుకునే ఛాన్స్ ఉంద‌ని బి-టౌన్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: