జనవరి 26 అంటే ఇవాళ వెంకటేష్ కొత్త సినిమా గురు విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమాని శివరాత్రి సీజన్ లో దింపాలి అనుకుంటున్నారు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాత్రం మరింత కొత్త డేట్ కి ఈ సినిమాని తీసుకెళ్ళే ఆలోచన చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ఘాజీ వస్తోంది కాబట్టి గురు ని గ్యాప్ ఇవ్వాలని చూస్తునారు. ఏప్రిల్ లో బాహుబలి 2 ఉండగా దాని తరవాతనే గురు రావచ్చట. ఒక సీనియర్ హీరో సినిమాని పోస్ట్ పోన్ చెయ్యడం అంటే సురేష్ బాబు డేరింగ్ కి మెచ్చుకోవాలి అంటున్నారు చాలా మంది. గురు ఆయన సొంత ప్రొడక్షన్ సినిమా థియేటర్ లు ఆయన చేతిలోనే ఉంటాయి ఎప్పుడు కావాలన్నా విడుదల చేసుకోవచ్చు , కానీ ఇతర సినిమాలకి గ్యాప్ ఇవ్వడం కోసం ఈ సూపర్ నిర్ణయం తీసుకున్నారు ఆయన.


మరింత సమాచారం తెలుసుకోండి: