గ్లామర్ హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలియాన కెరీర్ లో పీక్స్ ఉంది. ప్రతి ఒక్కరూ ఇలియాన  జపం చేస్తుండగా ఈ బ్యూటీ సైలెంట్ గా బాలీవుడ్ కి చెక్కేసింది. అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇలియానకి ఎప్పుడూ చిన్న చూపే. ఇక్కడ పద్దతిగా గ్లామర్ రోల్స్ చేసే ఇలియాన…కోలీవుడ్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలకి వెళ్ళినప్పుడు మాత్రం ఎక్స్ పోజింగ్ తెగ చూపించేది.


తెలుగు డైరెక్టర్స్ ఎక్స్ పోజింగ్ చూపించాలని అడిగీతే గతంలో బారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసి భయపెట్టేది. ఇదిలా ఉంటే బాలీవుడ్లో స్టార్ అయిపోవాల‌ని క‌ల‌లు క‌నేసి అక్కడే మకాం పెట్టిన ఇలియాన…అక్కడ కల్ఛర్ కోసం బోల్డ్ గా మారిపోయింది. గతంలో గ్లామర్ రోల్స్ అంటే సినిమా కథకి ఎంత అవసరమో అంతవరకే చేస్తాను అని మాటలు చెప్పిన ఇలియాన…ఇప్పుడు మాత్రం వ్యక్తిగతంగా ఇబ్బంది లేనంత వరకూ ఎక్స్ పోజింగ్ చేయవచ్చు అంటూ కామెంట్స్ చేస్తుంది.


ఇదంత బాలీవుడ్ ఆఫర్స్ కోసం ఇలియాన పడుతున్న తిప్పలు అని అందరూ అనుకోవటం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఇలియాన పలుసార్లు హాట్ ఫోటోషూట్స్ ని చేయించుకుంది. వీలు కుదిరినప్పుడల్లా తను హాట్ ఫోజ్ లతో బాలీవుడ్ ఇండస్ట్రీని రెచ్ఛగొట్టేది. ఇలియానకి అవకాశాలు వస్తే ఒకేసారి రెండు మూడు ఆఫర్స్ వస్తాయి. లేదంటే కనీసం రెండు సంవత్సారాలు అయినా ఖాళీగా కూర్చోవల్సిన పరిస్థితి వస్తుంది.


ఆఫర్స్ ని బ్యాలెన్స్ చేసుకోవటంలో ఇలియాన ఫెయిల్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే కేవలం ఆఫర్స్ కోసం ఇలియాన ఎక్స్ పోజింగ్..న్యూడ్ ఫోజ్ లు వంటి వాటిపై ఆధార పడటం అనేది తన లాంగ్ కెరీర్ కి ఇది ఏమంత ఉపయోగపడదని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. ఇలియాన…ఇకనైనా కథా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే ఇలియాన కెరీర్ రాంగ్ రూట్లో వెళ్లి ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: