ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వర్మ అన్నట్టుగా మారింది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా విషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సైతం ఇండస్ట్రీలోని మెజారిటీ సపోర్ట్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేసిన వారిలో వర్మ ఒకరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి వర్మ సపోర్ట్ ఎక్కువుగా ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని వర్మ తిడుతూ, మరికొన్ని సందర్భాల్లో పొగుడుతూ ఉంటారు.


అలాగే మెగాఫ్యామిలీకి సంబంధించిన హీరోల విషయంలో వర్మ ఇదే పంథాని అనుసరిస్తారు. ఇక తాజాగా వర్మపై పవన్ కళ్యాణ్ ఫైనల్‌ కౌంటర్ ఇచ్చేశాడు. కూతురితో బూతు సంభాషణలు చేసే వ్యక్తితో మాట్లాడటం అనవసరం అనేది పవన్ ప్రెస్ ఎందుకు ఇచ్చిన క్లారిటీ. ఈ స్టేట్మెంట్ విన్న తరువాత విచిత్రంగా ఉండే వర్మ సైతం కాస్త మనిషిగానే స్పంధించారు. పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన వర్మ మాటల్లో అంతర్లీనంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎన్నో విషయాలను బయటకు చెప్పారు. అలాగే నీతి ఏంటి? అనే విషయాన్ని కూడ స్పష్టంగా చెప్పుకొచ్చారు. వాటి వివరాలను చూస్తే…”ఫ్యామిలీలోని విషయాలను ఇతరులు మాట్లాడితే వీరు తిడతారు.


మరి వీళ్ళు మాడ్లావచ్చా. ఇదేనా వికాసం. నా జీవితం…నా లైఫ్ గురించి స్పష్టంగా బుక్ రాశాను. దాన్ని అర్ధం చేసుకోకుండా మాట్లాడటం కరెక్టేనా?. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అభిమానిగా హోదా గురించి సపోర్ట్ చేశా. తప్పేముంది.” ఇది పవన్ కళ్యాణ్ పై వర్మ తన ట్విట్టర్ వేధికలో చేసిన కామెంట్స్. అయితే వర్మ అన్నట్టుగా…ఇప్పటి వరకూ వర్మ చేసిన కామెంట్స్ లో ఏ వ్యక్తినయినా వర్మ వ్యక్తిగతంగా ఎన్నడూ కామెంట్ చేయలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ మేటర్స్ లో ఎన్నడూ వేలు పెట్టలేదు. తను ఎప్పుడు కామెంట్ చేసినా వారు చేస్తున్న వృత్తిపరమైన విషయాలను ఇతరులతో పోలుస్తూ కామెంట్స్ చేశారే కానీ వారి ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళి కామెంట్ చేయలేదు. అలాగే తన లైఫ్ స్టైల్ ని ఉన్నది ఉన్నట్టు చెప్పుకునే వ్యక్తిత్వం వర్మది.


ఇప్పటి వరకూ వర్మ ఎవరి ఫ్యామిలీ విషయాల్లో దూరలేదని క్లియర్ గా తెలుస్తుంది. అయితే మొదటిసారి వర్మ ఫ్యామిలీ విషయాలని బయటకు తెచ్చి తన కూతురితో జరిపిన సంభాషణలను ఇంకో విధంగా ప్రజలకు పవన్ కళ్యాణ్ వివరించటం అనేది తనకి బాధ కలిగించిన విషయం అని అంటున్నారు. అయితే ఇందుకు వర్మ తనదైన శైలిలో కౌంటర్ మొదలు పెట్టారు. “ఫ్యామిలీ విషయాలు నేను ఎప్పుడూ మాట్లాడలేరు. ముఖ్యంగా తను చేసుకున్న ముడు పెళ్ళిళ్ళు గురించి నేను ఎప్పుడూ మాట్లాడలేదు”  అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక భవిష్యత్ లో పవన్ కళ్యాణ్..వర్మ ఫ్యామిలీ మేటర్స్ లోకి వస్తే…వర్మ సైతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పేస్తాను అని ఇండైరెక్ట్ గా ఇచ్చిన వార్మింగ్ ఇచ్చాడని అంటున్నారు. అయితే దీనిపై మరింత దుమారం భవిష్యత్ లో జరిగే ప్రమాధం ఉందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: