ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రెండు రాష్ట్రాల్లో హాట్ న్యూస్ గా నిలిచాడు. సినిమా హీరో నుండి జనసేన అధినేతగా పవన్ తన మార్క్ చూపిస్తున్నాడు. అయితే ఆయనకు అంత్యంత సన్నిహితుడు ఆరాధ్యుడు బండ్ల గణేస్జ్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ స్టామినా గురించి చెప్పారు. పవన్ ఓ శక్తివంతుడని.. గాడ్ మేక్ ఏ రేర్ పీస్ అది పవన్ అని అన్నారు.


ఇక ఎన్నో ఇంటర్వ్యూస్ లో అడిగినా సమాధానం చెప్పని పవన్ మూడో కన్ను రహస్యం బయట పెట్టాడు బండ్ల గణేష్. పవన్ మూడో కన్ను తెరిస్తే ఇక తట్టుకోలేమని.. తాను కూడా చాలా సార్లు పవన్ తో తిట్లు తిన్నానని.. కాకపోతే ఓ గదిలో తీసుకెళ్లి తిడతాడని. సంస్కారం కలిగిన వ్యక్తంటూ పవన్ మీద తన అభిమానాన్ని మరోసారి చూపించాడు బండ్ల గణేష్.


జనసేన అధినేతగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల గురించి పోరాడుతున్నారు. అటు సినిమాలను తీస్తూనే మరో పక్క పార్టీ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. ప్రశ్నించడానికే వచ్చానంటూ యువత ప్రోత్సాహంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటం తన అభిమానులు కార్యకర్తలతో ముందుకు సాగుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: