బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా టబు అంటే సూపర్ క్రేజ్.. ఇక్కడ ఓ ఊపు ఊపేసిన తర్వాత అమ్మడు బీ టౌన్ కు షిఫ్ట్ అయ్యింది. తన అందాలతో అప్పటి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆ అమ్మడు ఇప్పటికి హాట్ ఫేవరేట్ అంటే నమ్మాలి. అయితే టబు తర్వాత అలాంటి ఫీచర్స్ ఏ హీరోయిన్ రాలేదు. కాని కొత్తగా వచ్చిన ఓ సౌత్ బ్యూటీ మాత్రం టబుని తలపిస్తుంది.


అదితి రావు హైదరి.. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ఈ అమ్మడు అక్కడ అంతగా క్రేజ్ సంపాదించలేదు. అందుకే ఇక సౌత్ బాట పట్టింది. హైదరబాది అమ్మాయే అయిన వెస్ట్రెన్ కల్చర్ బాగా అలవరచుకున్న అదితి అచ్చం టబులానే అనిపిస్తుందని అంటున్నారు. అందంతో ప్రేక్షకులను మత్తులో దించే సౌందర్యంతో అమ్మడు ప్రస్తుతం మణిరత్నం డైరక్షన్ లో కార్తి హీరోగా చేస్తున్న చెలియా సినిమాలో నటిస్తుంది.


రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ లో అమ్మడు సేం టూ సేం టబు అని ఫిక్స్ అయ్యారు అంతా.. మరి జూనియర్ టబు అనిపించుకుంటున్న ఈ అమ్మడు ఫ్యాన్స్ ను అదే రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం చెలియా సినిమా పూర్తయ్యాక ఆ సినిమా ఫలితాన్ని బట్టి తెలుగులో కూడా అవకాశాలను ఇవ్వాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: