టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమా ఓ కుర్ర హీరోతో మొదలైన ఆమె తెలుగు సినిమా ప్రస్థానం ఇప్పుడు స్టార్స్ పక్కన్న మొదటి ఆప్షన్ లా మారింది. అయితే తనకు వచ్చిన ఈ క్రెడిట్ కోసం తాను చాలా కష్టపడ్డానని అంటుంది. తను కూడా కెరియర్ లో ఎన్నో అవమానాలు పొందానని చెబుతుంది.


టాలెంట్ ఉన్నా సరే కొన్ని సార్లు సిని పరిశ్రమలో అవమానాలు తప్పవు. రకుల్ విషయంలో కూడా అంతే.. ఓ సినిమాకు సెలెక్ట్ అయ్యానని చెప్పడం సడెన్ గా ఆ మూవీ ఓపెనింగ్ కల్లా వేరే హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం ఇదంతా తను మొదట అర్ధం చేసుకోలేకపోయిందట. కాని చిన్నగా అలవాటు పడ్డానని అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.


ప్రస్తుతం తెలుగులో తనకు వచ్చిన ఈ స్టార్డం గురించి మాట్లాడుతూ తెలుగు ఆడియెన్స్ కు తన ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతుంది. సౌత్ లో అత్యధిక మార్కెట్ ప్రభావం చూపించే తెలుగు సినిమాల్లో తనకు ఈ రేంజ్ క్రేజ్ రావడం అమ్మడు సంతోషంగా ఉంది. మొదట అవమానాలు పడినా ఈ సక్సెస్ వాటినన్నిటికి సమాధానం చెప్పిందని అంటుంది రకుల్. 



మరింత సమాచారం తెలుసుకోండి: