హాట్ బ్యూటీ అనసూయ బుల్లితెర నుండి వెండితెరకు ప్రమోట్ అయ్యింది. ఐటం సాంగ్ చేయను చేయను అంటేనే మెగా హీరో విన్నర్ కోసం సూయ సూయ అనసూయ అంటూ రచ్చ చేసిన అనసూయ ఎన్నో ఆశలు పెట్టుకున్న సాంగ్ కాస్త తుస్ మనిపించింది. పవర్ స్టార్ తో కాదని మరి సాయి ధరం తేజ్ తో సాంగ్ చేసిన ఈ అమ్మడు సినిమాకు అసలు హెల్ప్ అవలేదని తెలుస్తుంది.


అనసూయ ఐటం సాంగ్ అంటూ సినిమా మీద ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేయగా థియేటర్ లో మాత్రం ఆ పాట అంతగా ప్రభావితం చేయలేదని అంటున్నారు. బుల్లితెర మీద అందాలతో రెచ్చగొట్టే అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం తేలిపోయిందన్న టాక్ కూడా వస్తుంది. అంతేకాదు ఈ మాత్రం దానికేనా అమ్మడు ఇంత హడావిడి చేసింది అని సెటైర్స్ వేస్తున్నారు.


తనకున్న హాట్ ఇమేజ్ ఇంకాస్త పెంచుకునే క్రమంలో తన పేరు మీద పాట రాయించుకున్నా సరే అమ్మడు అంతగా క్లిక్ అవ్వలేదు. ఓ పక్క స్టార్ హీరోయిన్సే ఐటం సాంగ్స్ చేస్తుంటే స్మాల్ స్క్రీన్ ఇమేజ్ తో వచ్చిన అనసూయ ఏమాత్రం ఆకట్టుకోలేదు. సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత క్షణంతో డిఫరెంట్ లుక్ లో కనిపించిన అనసూయ విన్నర్ ఐటం లో మాత్రం ఫ్యాన్స్ ను నిరాశ పరచింది. అనసూయని సరిగా వాడుకోలేకపోయారన్న టాక్ ఉన్నా కేవలం ఈమె అందాలు స్మాల్ స్క్రీన్ వరకే బిగ్ స్క్రీన్ పై తేలిపోయానని కూడా అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: