టాలీవుడ్ అందగాడు అంటే అది కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ అని అందరు ముక్తకంఠంతో చెబుతుంటారు. అమ్మాయిల కలల రాకుమారుడిలా మహేష్ తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకున్నాడు. మహేష్ కు లేడీ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అదే విధంగా జెంట్స్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది అదే విధంగా ఉంటుంది. 


శోభన్ బాబు తర్వాత అంతటి అందగాడు కచ్చితంగా మహేష్ బాబు అని అందరు అంటుంటారు. ఇక ఇదే విషయాన్ని సీనియర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాస రావు అన్నారు. రీసెంట్ గా ఆలితో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న కోటా తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడమే కాకుండా టాలీవుడ్ లో తనకు ఇష్టమైన హీరోల గురించి మనసు విప్పారు.


తనకు జూనియర్ ఎన్.టి.ఆర్, బన్నిల యాక్టింగ్ అంటే ఇష్టమని.. తారక్ కు వాక్ చాతుర్యం బాగా ఉంటుందని అన్నారు. ఇక వారి తర్వాత మహేష్ అన్న కూడా ఇష్టమని అన్నాడు కోటా శ్రీనివాస్ రావు. ఎంతమంది హీరోలొచ్చినా మహేష్ లా ఎవరు ఉండరని కోటా అభిప్రాయపడ్డారు. అందానికి ప్రతిరూపంగా మహేష్ ఎంత హ్యాండ్సం గా ఉంటాడో అందరికి తెలిసిందే. 


టాలీవుడ్ నంబర్ వన్ పొజిషన్ లో నిలబడే సత్తా ఉన్న మహేష్ గ్లామర్ మెయింటైనెన్స్ అందరికి షాక్ ఇస్తుంది. తన లుక్ విషయంలో మహేష్ తీసుకునే కేర్ ఇలా అందరి చేత తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా మహేష్ లుక్ ఉంటుంది. కోటా మాటలకు మహేష్ ఫ్యాన్స్ కాస్త ఉత్సాహంగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: