బాహుబలి మూవీ కోసం హీరో ప్రభాస్ ఎంతో విలువైన సమయాన్ని కేటాయించారు. అయితే ఇందుకు ప్రతి ఫలంగా ఇప్పుడు ప్రభాస్ కేవలం 8 నెలల్లో 100 కోట్ల రూపాయలను అందుకోనున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న దీనికి సంబంధించిన వివరాలను చూస్తే...బాహుబ‌లి రిలీజ్ త‌ర్వాత ప్ర‌భాస్ స్టార్ డం ఇంకాస్త పెరిగింది. రీజనల్ మూవీకి సంబంధించిన స్టార్ ఒక్కసారిగా నేషనల్ హీరోగా మారిపోయాడు.


ఇప్పుడు బాహుబలి టీం అంటే నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా బాహుబలిగా చేసిన ప్రభాస్ పాత్రకి అందరిలోనూ క్రేజ్ ఏర్పడుతుంది. తాజాగా బాహుబలి2ని ముగించుకున్న ప్రభాస్‌ కి పెద్ద పెద్ద యాడ్‌ కంపెనీలు క్యూలు కట్టాయి. నేషనల్ మార్కెట్ లో ప్రభాస్‌ మార్కెట్ కి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు కంపెనీలు ప్రభాస్ తో యాడ్స్ ని చేయించుకోవటం కోసం క్యూలు కడుతున్నాయి.


బాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్స్ కి ఇప్పటి వరకూ దక్కని భారీ బ్రాండ్స్ సైతం ప్రభాస్ వద్దకు చేరుకున్నాయి. దీంతో ప్రభాస్ సైతం ఇదే మంచి సమయంగా భావించి ఒక్కో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించేందుకు 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడు. ఇంత చార్జ్‌ చేస్తున్నప్పటికీ..కార్పోరేట్ కంపెనీలు మాత్రం ఏ మాత్రం వెనకాడటం లేదు. అయితే కంపెనీల డిమాండ్ ప్రకారం రెండు సంవత్సరాల అగ్రిమెంట్స్ అయితే ఓకె అంటున్నారు.


కానీ ప్రభాస్ మాత్రం కేవలం సంవత్సరం మాత్రమే అని అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ ముందు దాదాపు 15 బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో 10 బ్రాండ్స్ దాదాపు కన్ఫర్మ్ అని అంటున్నారు. వీటితో 8 నెలల్లో అగ్రిమెంట్స్ ని కుదుర్చుకోనున్నారు. దీంతో ఈ బ్రాండ్స్ కారణంగా ప్రభాస్ మరో 100 కోట్ల రూపాయలను సంపాదించుకోవచ్చనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న లెక్కలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: