యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడటం అంటే సామాన్యంగా ఉండదు. తను మాటలు చెప్పటం మొదలు పెట్టాడంటే  ఎదుటివారు కచ్ఛితంగా వినాల్సిందే. ఎన్టీఆర్ కి ఉన్న టాలెంట్స్ లో ఇది ఒకటి. ఇక తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఓ పనికి ఇండస్ట్రీలో మామూలుగా రియాక్షన్ రావటం లేదు. అందరూ దీని గురించే మాట్లాడుకుంటుంన్నారు. స్వయంగా ఎన్టీఆర్ ఈ విధంగా చెప్పటం అనేది నిజంగా అందరినీ ఆశ్ఛర్యపరిచిన విషయంగా మారింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…ఓ తోటి హీరోను మరో హీరో పొగడడం అనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తుంటాం. అనుకూలంగా ఉన్న హీరోలపై పైనే హీరోలు కామెంట్స్ చేస్తుంటారు. కానీ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం టాలీవుడ్ హీరోల గురించి తనదైన స్టైల్ లో ప్రశంసలు కురింపిచారు.  అందగాడు ఆఫ్ టాలీవుడ్ ఎవరు అన్న ప్రశ్నకి జూనియర్ వెంటనే తనదైన స్టైల్ లో జవాబు ఇచ్చారు.


ఇంకెవరు మహేశ్‌బాబు అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన సమాధానం అందరికీ ఆశ్ఛర్యాన్ని ఇచ్చింది. తాజాగా నిర్వహించిన ఐఫా ఉత్సవంలో ఈ సంఘటన జరిగింది. ఇక జనతాగ్యారేజ్ సినిమాకు గానూ ఉత్తమ నటుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అవార్డ్ ని దక్కించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరించిన నాని, రానాలను ప్రశంసించాడు. నటుడిగా రానా అంటే ఇష్టమని, వాయిస్ పరంగా నానిని ఇష్టపడతానని చెప్పటం మరో హైలెట్ అయింది.


గతంలో తోటి హీరోలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసేవాడిని కాదనే రూమర్ ఉండేది. కానీ ఇప్పుడు అందరి హీరోలతో కూల్ గా ఉండటం చూసి…హీరోల మధ్య ఎటువంటి కోపాలు లేవని స్పష్టంగా తెలియజెప్పే ప్రయత్నాన్ని ఎన్టీఆర్ చేశాడు. ఇక ఐఫా అవార్డ్ ఫంక్షన్ లో ఇలాంటి చలోత్తులు చాలానే జరిగాయని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: