దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అప్ కమింగ్ మూవీ ‘బాహుబలి – ది కంక్లూజన్’. ఈ  చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానున్న సందర్బంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి చెందిన పలు మూవీలపై ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఈ ఎఫెక్ట్ ఎక్కువుగానే ఉంది. ఆ రోజు థియోటర్స్ లో ఏ మూవీ రిలీజ్ అయ్యే సాహసం చేయటం లేదు. అన్నీ థియోటర్స్ లో బాహుబలి తప్పితే మరో మూవీ ప్రదర్శన జరిగే ఛాన్స్ కూడ కనిపించటం లేదు.


ఒకవేళ మరో మూవీ రిలీజ్ అయినప్పటికీ…ఆ మూవీకి బాహుబలి మించిన పబ్లిసిటి అవసరం అవుతుంది. ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. అంత సాహసం ఏ నిర్మాత చేయటం లేదు. ఇదిలా ఉంటే ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని చిన్న మూవీలపై బాహుబలి ఎఫెక్ట్ ఎక్కువుగా కనిపిస్తుంది. బాహుబలి రిలీజ్ డేట్ ఏప్రిల్ 28. ఈ నెలలో చిన్ని సిసినిమాలకి సంబంధించిన ఏ మూవీలు రిలీజ్ కావటం లేదు. ఒకవేళ ఏప్రిల్ మధ్యలో చిన్న సినిమాలు విడుదలైతే బాహుబలి రిలీజ్ సమయానికి అన్ని థియేటర్లు ఖాళీ చేయవలసి వస్తుంది.


దాని కంటే బాహుబలి తరువాత అంటే మే నెలలో ప్లాన్ చేసుకోవటం బెటర్ అని అంటున్నారు. అంటే వీరి ఉద్ధేశం మే చివరి వారంలో చిన్న మూవీలని రిలీజ్ చేయాలని. కానీ ఓ హీరో మాత్రం కాస్త సాహసం చేసి బాహుబలి రిలీజ్ అయిన వారం రోజులకే తన మూవీని థియోటర్స్ కి ప్లాన్ చేశారు. శ్రీనివాస్ అవసరాల అడల్ట్ కామెడీ చిత్రం ‘బాబు బాగా బిజీ’ ఈ సాహసం చేస్తుంది. నిజానికి ముందుగా ఈ సినిమాని ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ తరువాత డేట్ ని మార్చుకొని బాహుబలి రిలీజ్ అయిన వారం రోజులకి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు.


దీంతో బాబు బాగా బిజీ మూవీ మే 5 న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి క్రియేట్ అయింది. అందుకే బాహుబలి వంటి సీరియస్ సినిమాని చేసేవాళ్ళతో పాటు కాస్త రొమాంటిక్ చిత్రాన్ని చూడాలనుకునే వారు కూడ ఉంటారు కాబట్టి….అటువంటి వాళ్ళు థియోటర్ కి వస్తే చాలు అని భావిస్తుంది బాబు బాగా బిజీ చిత్ర యూనిట్. మొత్తంగా ఈ చిత్రంలో శ్రీముఖి, తేజస్వి, మిస్తీ చరవర్తి, సుప్రియ ఐసోలు హీరోయిన్లుగా నటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: