టాలీవుఢ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పాలోయింగ్ ఏ హీరోకి ఉండదని చెప్పవచ్చు. పవన్ కళ్యాన్ కి తన సినిమాల ద్వార ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారో…తనని వ్యక్తిగతంగా అభిమానించే ఫ్యాన్స్ సైతం దానికి మంచి ఉంటారు. ఇలా పవన్ కళ్యాణ్ కి ఫ్రత్యేకమైన ఆధరణ ఇండస్ట్రీలో ఉంది.


ఇదిలా ఉంటే తాజాగా మెగాహీరోలలోని ఓ హీరో సాయిధరమ్ తేజ్…పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్నాడని అంటున్నారు. తన సినిమాలలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అనుకరణ ఉండేవిధంగా సాయిధరమ్ తేజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా సాయిధరమ్ తేజ్ త్వరలో పవన్ కళ్యాణ్ మూవీలో ఓ చిన్న పాటి పాత్రను పోషించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మూవీలో నటిస్తున్నారు.


ఈ మూవీలో కొద్ది సెకండ్ల పాటు ఉండే పాత్రను అయినా తను చేయాలని సాయిధరమ్ తేజ్ భావిస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ ని సాయిధరమ్ తేజ్ కలిసారని అంటున్నారు. మొత్తంగా ఒకవైపు చిరంజీవి సపోర్ట్ తనకి ఫుల్ గా ఉండటమే కాకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని సైతం ఉపయోగించుకోవాలని సాయిధరమ్ తేజ్ చూస్తున్నారు. సాయిధరమ్ తేజ్ కి ఇప్పటికే తన కంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.


దానిని ఇంకాస్త స్టాండర్ట్ చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ పై దృష్టి పెట్టారని అంటున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ తాజాగా నటించిన విన్నర్ చిత్రం తనకి మంచి పేరుని తీసుకువచ్చింది. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో చేస్తున్న నక్షత్రం మూవీ యాక్టింగ్ పరంగా తనకి మంచి పేరుని తీసుకువస్తుందని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: