ఈ ఐపిఎల్ ఈసీజన్ లో కాస్త వెనుకపడ్డ రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ సీజన్ లో మొదట కొన్ని మ్యాచ్ లకు దూరంగా ఉన్న కొహ్లి మళ్లీ టి20లో తన సత్తా ఏంటో చాటాడు ఈ సీజన్ లో 64 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ చేశాడు విరాట్ కొహ్లి. ఇక గేల్ ఆడితే ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. 38 బంతులకు 77 పరుగులతో విధ్వంసం సృష్టించాడు క్రిస్ గేల్. గుజరాత్ టాస్ గెలిచి బెంగళూరికి బ్యాటింగ్ ఇచ్చింది. ఇక నిర్ణీత ఓవర్లలో కేవలం 2 వికెట్లకే 213 పరుగులు చేశారు బెంగళూరు ఆటగాళ్లు.


ఇక 214 భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ మెక్ కల్లం 72 పరుగులు చేయగా రైనా 23, ఫించ్ 19, దినేష్ కార్తిక్ 20 పరుగులకే అవుట్ అయ్యారు. చివర్లో ఇషాన్ కిషన్ 39 రవింద్ర జడేజా 23 ప్రయత్నించినా 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది గుజరాత్ జట్టు. ఇక గుజరాత్ పై 21 పరుగుల తేడాతో మ్యాచ్ విజయం సాధించింది బెంగళూరు జట్టు.  



మరింత సమాచారం తెలుసుకోండి: