అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య కెరియర్ సోసోగా నడుస్తుందని చెప్పొచ్చు. స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో నాగ చైతన్య ఎందుకో వెనుకపడ్డాడు. లవర్ బోయ్ ఇమేజ్ తో కెరియర్ నడిపిస్తున్న చైతు ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో రారండోయ్ వేడుక చూద్దాం సినిమా చేస్తున్నాడు.


పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా అసలైతే మే 19న రిలీజ్ చేయాలని చూశారు. మొన్నామధ్య నాగార్జున ప్రెస్ మీట్ పెట్టి మరి సినిమా చలా బాగా వచ్చిందని అన్నాడు. మరి ఇంతలో ఏమైందో ఏమో మే 19 నుండి సినిమాను జూన్ 8కి రిలీజ్ పోస్ట్ పోన్ చేశారట. సినిమా రిలీజ్ కు రెడీ అయినా మే 19న నిఖిల్ సుధీర్ వర్మల కాంబినేషన్ లో వస్తున్న కేశవ సినిమా రిలీజ్ అవుతుంది.


ఆ సినిమాకు పోటీగా ఎందుకు అనుకున్నారో ఏమో కాని రారండోయ్ సినిమాను జూన్ 8కి వాయిదా వేశారు. ఇక సినిమా వాయిదా పడటానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. సోగ్గాడే డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ రారండోయ్ క్లైమాక్స్ ఊహించిన విధంగా తీయలేదని అందుకే ఈ సినిమా క్లైమాక్స్ మళ్లీ రీ షూట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు.


కారణాలేవైనా మే నుండి చైతు ఎక్సిట్ అయ్యాడు. ఇక రివెంజ్ డ్రామాగా రక్తపు మడుగులతో కేశవగా నిఖిల్ అంచనాలతో వస్తున్నాడు. అనుకున్నట్టుగా కేశవ అదరగొడతాడో లేదో తెలియాల్సి ఉంది. ఇక రారండోయ్ సినిమా నాగార్జున నిన్నే పెళ్లాడతా, మన్మధుడు రెండిటిని కలిపితే వచ్చే సినిమాగా ప్రచారం జరుగుతుంది. సక్సెస్ లతో దూసుకెళ్తున్న చైతు రారండోయ్ తో ఫ్యాన్స్ వేడుక చేసుకునేలా చేస్తాడో లేదో చూడాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: