కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ కు ఒకప్పటి ముంబై మాఫియా డాన్ హజి మస్తాన్ దత్తపుత్రుడు నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. తన తండ్రి మీద సినిమా చేస్తున్నారన్న విషయం తెలియడంతో ఈ నోటీసులు పంపించారు. అయితే ఇలాంటి బెదిరింపులకు ఏమాత్రం లొంగేది లేదని చిత్రయూనిట్ చెబుతుంది.


కబాలి తర్వాత పా రంజిత్ దర్శకత్వంలో రజినికాంత్ చేస్తున్న ఈ సినిమాలో రజిని మరోసారి మాఫియా డాన్ గా కనిపిస్తున్నాడట. అయితే వారు అనుకుంటున్నట్టు ఇది ఎవరి గురించి కాదని ఈ కథ వేరేలా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ టాపిక్ గురించే కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది.


కబాలి అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాకపోయినా రజిని మరోసారి రంజిత్ కు పిలిచి అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే సినిమాను నిర్మిస్తుంది రజిని అల్లుడు ధనుష్ అవడమే. ఓ పక్క హీరోగా చేస్తూనే దర్శక నిర్మాతగా భాధ్యతను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు ధనుష్. ఇక రజిని సినిమా మాత్రం ఈసారి అదరగొట్టడం ఖాయమని అంటున్నారు.


కబాలి సినిమాలో మిస్ అయిన ఎలిమెంట్స్ ఇందులో ఉంచి.. సినిమా మరో ట్రెండ్ సెట్టర్ అయ్యేలా చేస్తున్నారు. మే 26 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మొదలవడానికి ముందే కాస్త ఇబ్బందులు ఎదుర్కుంటున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: