సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా యూనిట్ ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇక సడెన్ గా మహేష్ స్పైడర్ లో క్రేజీ బ్యూటీ నయనతార ఉంది అంటూ కోలీవుడ్ లో హడావిడి చేస్తున్నారు.


మహేష్ స్పైడర్ మూవీకి నయన్ కు సంబంధం ఏంటి అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ స్పైడర్ లో ఓ ఇంపార్టెంట్ రోల్ నయనతార చేస్తుందట. ఆ రోల్ కోసం ఇప్పటిదాకా ఎవరిని అడుగలేదట మురుగదాస్. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా సూపర్ ఫాంలో ఉన్న నయనతార మహేష్ సినిమాలో నటిస్తుందా అన్న డౌట్ వస్తుంది.


కాని చిత్రయూనిట్ నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమాలో నయన్ ఓ సర్ ప్రైజ్ రోల్ చేస్తుందట. మూవీ టర్న్ చేసే ఈ పాత్రకు నయనతార ఓకే చెప్పడం విశేషం. తన కెరియర్ లో గజిని లాంటి సూపర్ హిట్ ఇచ్చిన మురుగదాస్  అడగడం నయనతార కాదనడమా అంటూ వార్తలు వస్తున్నాయి.


మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ అఫిషియల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగష్టు చివర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: