సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ ఆగష్టు రిలీజ్ అని అంటున్నారు. ఇక ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే శ్రీమంతుడు డైరక్టర్ కొరటాల శివతో మరో సినిమా ముహుర్తం పెట్టాడు మహేష్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ భరత్ అను నేనుగా ప్రచారం జరుగుతుంది.


ఇక ఈ సినిమా అసలైతే ఏప్రిల్ లో స్టార్ట్ అవ్వాల్సి ఉన్నా స్పైడర్ షూటింగ్ లేట్ అవుతున్న సందర్భంలో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం మహేష్ స్పైడర్ మే 22 నుండి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేస్తున్నారట. మిగత స్టార్ కాస్ట్ తో షూటింగ్ స్టార్ట్ చెస్తే మహేష్ మాత్రం జూన్ లో షూటింగ్ లో పాల్గొంటాడట. 


మహేష్ చేస్తున్న స్పైడర్ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మే 30 సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా స్పైడర్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ మాత్రమే కాదు సినిమాలో మహేష్ స్టిల్స్ ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాయి.


స్పైడర్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుండగా రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి హారీస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: