దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో ప్రప్రంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐదేళ్లు ఒక సినిమా రెండు పార్టులుగా తీసి సూపర్ సక్సెస్ అందుకున్న జక్కన్న ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ కొత్త అధ్యయనానికి నాంధి పలికాడు. ఈ క్రమంలో రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ లో అంచనాలున్నాయి.


ఇక బాహుబలి తర్వాత రాజమౌళి చేసే సినిమా ఏంటి అన్నది ఇప్పుడు అందరికి సమాధానం తెలుసుకోవాలనుకునే ప్రశ్న. కొందరేమో బాహుబలిని మించి సినిమా తీస్తాడు అంటుంటే మరికొందరేమో ఈసారి ఓ చిన్న సినిమా తీస్తాడని అంటున్నారు. ఏది తీసినా రాజమౌళి నుండి తర్వాత రాబోయే సినిమా మీద అందరి దృష్టి ఉంది.


అది కేవలం తెలుగు ఆడియెన్స్ ను మాత్రమే సాటిస్ఫై చేస్తే సరిపోదు రాజమౌళి ఇప్పుడు నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు కాబట్టి తన తర్వాత సినిమా కూడా అదే రేంజ్ లో వచ్చేలా చూసుకోవాలి. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి తర్వాత తీసే సినిమాపై స్పందిస్తూ ఈసారి రాజమౌళి ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా కథ అడిగాడని అన్నాడు.


సో ఈ లెక్కన చూస్తుంటే జక్కన్న ఈసారి ప్రయోగాలేమి చేయకుండా ఓ చిన్న సినిమా తీస్తాడని తెలుస్తుంది.  ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో అని డిస్కషన్స్ మొదలయ్యాయి. కుర్ర హీరోల్లో సత్తా చాటుతున్న ఇద్దరి ముగ్గురు పేర్లు ఇప్పటికే ఫైనల్ చేశారట వారిలో ఎవరో ఒకరికి రాజమౌళి సినిమా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: