మెగా హీరోల్లో ఇంతవరకు ఓ సూపర్ హిట్ సినిమా కొట్టకపోయినా సరే మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ అంటే ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందుకే ఈ మెగా హీరోకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. ఇక వరుణ్ తేజ్ మీద ఇష్టంతో ఓ వీరాభిమాని అతనికో సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.


తానే స్వయంగా వేసిన వరుణ్ తేజ్ పెయిటింగ్ తో అబ్బురపరచింది ఆ అభిమాని. డైరెక్ట్ గా వరుణ్ తేజ్ ను కలిసి తన గిఫ్ట్ ను అందచేసింది. అభిమాని గిఫ్ట్ కు వరుణ్ తేజ్ కూడా సర్ ప్రైజ్ అయ్యాడని తెలుస్తుంది. వరుణ్ తేజ్ మీద లేడీ ఫ్యాన్స్ చూపించిన అభిమానం ప్రస్తుతం అందరి చేత వారెవా అనేలా చేస్తుంది.


ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ రీసెంట్ గా మిస్టర్ సినిమాతో వచ్చాడు. మెగా హీరోగా స్టార్ క్రేజ్ ఉన్నా సరే తనదైన శైళిలో కొత్త కథలకు సహకారం అందించాలని చూస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ అందుకున్న ఈ గిఫ్ట్ ను లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్ లో పెట్టేసింది.


ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఫిదా మూవీ చేస్తున్న వరుణ్ తేజ్ ఆ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: