న‌షా....ఇది షారుక్ సినిమా కాదు...ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా అంత‌కంటే కాదు. కానీ బిటౌన్ కుర్రకారంతా చకోర ప‌క్షుల్లా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ముంబాయ్ లోని కొన్ని చోట్ల ఆల్ రెడీ టిక్కెట్ బుకింగ్ కూడా అయిపోయింద‌ట‌. మ‌రి న‌షా స్పెషాలిటి..?

న‌షా ...హాట్ బ్యూటీ పూన‌మ్ పాండే న‌టించిన సినిమా . ఇప్పటికే రిలీజైన ఈ మూవీ పోస్టర్స్ పిచ్చెక్కిస్తున్నాయి. పోర్న్ బేబీ స‌న్నీలియోన్  బాలీవుడ్ తెరంగేట్రం చేసిన జిస్మ్2 కంటే కూడా పోస్టర్స్ నుండే త‌న అందంతో హీటెక్కించేస్తోంది పూన‌మ్ పాండే. 18ఏళ్ల అబ్బాయితో పాతికేళ్ల అమ్మాయికి మ‌ద్య ఇల్లీగ‌ల్ రిలేష‌న్ చుట్టూ క‌ధ తిరుగుంద‌ని  ఎప్పుడైతే ద‌ర్శకుడు అమిత్ స‌క్సేనా ఎనౌన్స్ చేశారో ఆ రోజు నుండే ఈ సినిమాలో పూన‌మ్ అందాల విందు ఇంకా ఏ రేంజ్ లో వుంటుందో అని ఊహ‌ల్లో తేలిపోతున్నారు బిటౌన్ ప్రేక్షకులు .  వారిని అదే అంచ‌నాల‌తో ధియేట‌ర్లలో అడుగుపెట్టేలా చేయాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంద‌ని కొత్త కొత్త   మార్గాలు అన్వేషిస్తోంది పూన‌మ్ . ఆ ప్రాసెస్ లో భాగంగానే బ్యాక్ బేర్ ఫోటో పోస్టర్ ప్లాన్ చేశార‌ట‌. రేపు మాపో పూనం వెనుక‌బాగం ఏ ఆచ్చాధ‌న లేకుండా వున్న  ఫోటోను  రిలీజ్ చేయ‌బోతున్నారు. మ‌రి పోస్టర్స్ తోనే కేక పెట్టిస్తున్న పూనం సినిమాలో ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసే సీన్స్ చేసిందోక‌దా..? అది  తెలియాలంటే ఈనెల 26దాకా వెయిట్ చేయ‌క‌త‌ప్పదండోయ్.  ఎందుకంటే న‌షా రిలీజైయ్యేది  ఆ రోజే మ‌రి.   

మరింత సమాచారం తెలుసుకోండి: