నాచురల్ స్టార్ నాని తెలుగులో ఏ స్టార్ హీరో అందుకోలేని అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఎవడే సుబ్రమణ్యం నుండి రీసెంట్ రిలీజ్ నిన్ను కోరి దాకా వరుసగా 7 హిట్లతో హోరెత్తిస్తున్నాడు నాని. నాచురల్ స్టార్ అన్న స్క్రీన్ నేం కు న్యాయం చేస్తూ నాని అదిరిపోయే రేంజ్ లో సినిమా ఫలితాలను అందుకుంటున్నాడు.


ఎవడే సుబ్రమణ్యం తర్వాత వచ్చిన భలే భలే మగాడివోయ్ నాని ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ, జెంటిల్ మన్, మజ్ఞు, నేను లోకల్, నిన్ను కోరి ఇలా వరుస విజయాలను అందుకుంటూ డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసుకుని నిన్నుకోరితో ట్రిపుల్ హ్యాట్రిక్ కు సిద్ధమయ్యాడు నాని.


ఏ స్టార్ హీరో కూడా ఇలా తన వరుస 7 సినిమాలను హిట్ చేసుకోలేదు. స్టార్ సినిమా ఒకటి రెండు హిట్ అయితే కచ్చితంగా మూడోది ఫెయిల్ అవుతుంది. నాని కథల సెలక్షన్స్ తో పాటుగా సినిమా సినిమాకు తనలోని ప్రతిభ ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో మంచి కథలు కూడా పడుతుండటంతో సూపర్ హిట్లు కొడుతున్నాడు.


నాచురల్ స్టార్ పవర్ తెలియచేయచేసే హిట్లు మాత్రమే కాదు కలక్షన్స్ రేంజ్ కూడా నాని సినిమా స్నీమాకు మార్కెట్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇక నాని కూడా 50 కోట్ల మార్కెట్ లోకి చేరితే ఇక తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నట్టే.



మరింత సమాచారం తెలుసుకోండి: