సినీరాజకీయ ప్రముఖుల గత జన్మల విశేషాలు చెబుతూ సంచలనంగా మారుతున్నారు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్. గత జన్మలో ఎక్కడ ఏ రూపంలో జన్మించారు? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నారు? ఎలా చనిపోయారు? అనే విషయాలను తెలుపుతూ ఎస్వీనాగ్‌నాథ్ చేస్తున్న ప్రొగ్రాం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
గత జన్మ ఆవిష్కరణ
ప్రతి వారం ఒక సెలబ్రెటీ గత జన్మ తెలిపే ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ తాజాగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ చేశాడు. వర్మ గత జన్మఎలా ఉండేది? గత జన్మ ఎక్కడ ఎలా సాగింది? అనే విషయాలపై నాగనాథ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్చల్ చేస్తోంది.
మిజోరమ్ ప్రాంతంలో జన్మించిన వర్మ
పూర్వ జన్మలో ఆర్జీవి భారత్‌లోనే మిజోరామ్ ప్రాంతంలో జన్మించాడని అస్ట్రో సైకాలజిస్ట్ నాగ్నాథ్ తెలిపారు. గత జన్మలో వర్మ ధనూర్ రాశి, ధనూర్ లగ్నంలో జన్మించాడని కోరికలు తీరకుండానే చనిపోయాడని చెప్పారు. పెళ్లి కూడా కాలేదని, ఎర్లీ ఏజ్‌లోనే గత జన్మ ముగిసిందని నాగ్నాథ్ తెలిపారు. మల్టీటాలెంటెడ్‌గా వర్మ ఊహించని జీవన విధానాన్ని గడిపాడట.
నేను ఎవర్నీ..?
నమస్తే తెలుగు ఛానల్లో హూ ఏమ్ ఐ(who am I) ఎపిసోడ్ ప్రసారమవుతోంది. ఇందులో ప్రముఖుల గత జన్మ రహస్యాలను జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్రసారమైన వర్మ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారుతోంది.
వైరల్ అవుతున్న ప్రొగ్రాం
సినీ, రాజకీయ ప్రముఖులందరి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్లతో ఈ కార్యక్రమం ఉంటుందని, ప్రతి వారం ఒక ఎపిసోడ్ ప్రసారమవుతుందని ప్రొగ్రామ్ డైరెక్టర్ స్వామి ముద్దం తెలిపారు. తాజాగా ప్రసారం చేసిన రామ్‌గోపాల్ వర్మ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు. సెలబ్రెటీల పాస్ట్ లైఫ్‌లను ఆవిష్కరించే ఇలాంటి కార్యక్రమం మీడియా చరిత్రలో తొలిసారని చెప్పారు.