పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినోవా కి కొడుకు పుట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. పవన్ - తన కొడుకు ని చూసి మురిసిపోతున్న ఫోటో ఇంటర్నెట్ లో హల్చల్ చెయ్యడం చూసాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో ఒకరకమైన వింత కథనం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకీరా నందన్ కే , నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పరిస్థితి వస్తుందా అంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్ కళ్యాణ్ - రేణు లకి పుట్టిన అకీరా నందన్ ఇప్పుడిప్పుడే పెద్దవాడు అవుతున్నాడు.  నందమూరి కుటుంబం లో కూడా హరికృష్ణ - కళ్యాణ్ రామ్ - ఎన్టీఆర్ ల విషయం లో ఇదే జరిగింది. కళ్యాణ్ రామ్ తల్లిని పెళ్లి చేసుకుని కళ్యాణ్ రామ్ కీ జానకి రాం కీ జన్మని ఇచ్చిన హరి కృష్ణ ఎన్టీఆర్ ని మరొక వ్యక్తి తో కన్నారు.

ఆ తరవాత కాలం లో ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం దగ్గరకి తీసుకోలేదు అనే పుకార్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీన్ని పరిగణ లోకి తీసుకుని అకీరా కి కూడా మెగా ఫామిలీ లో అలాంటి పరిస్థితే వస్తుందా ? అంటూ కొందరు ప్రశ్నలు వేస్తున్నారు.  జూనియర్ ఎన్టీఆర్ కి నందమూరి ఫామిలీ ఇచ్చిన ట్రీట్మెంట్ నే మెగా ఫామిలీ, కొణిదెల జనాలు అకీరా కి ఇస్తారా?మెగా ఫామిలీ లో జరిగిన ఏ ఫంక్షన్ లో అయినా కేవలం అన్నా, ఆమె కూతురు పోలీనా నే ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తూ వస్తున్నారు.

ఇక అకీరా పరిస్థితి కూడా జూనియర్ ఎన్టీఆర్ లాగా అవుతుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మెగా ఫామిలీ కి మెయిన్ పిల్లర్లు గా ఉన్న రామ్ చరణ్ , చిరంజీవి అంత కరకు స్వభావం కలవారు కాకపోవచ్చు కానీ ఇంట్లో ఉండే లేడీస్ ఇలాంటివి చాలా సీరియస్ గా పట్టించుకుంటారు . సో అలాంటి పరిస్థితి లో ఎన్టీఆర్ కి వచ్చిన ఇబ్బంది అకీరాకి రాకూడదు అనే కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: