మెగా వారసుడు రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’.   ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్  ఇటీవల విడుదల అయ్యింది. 'రంగస్థలం' సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. దాంతో టీజర్ ను ఎప్పుడు వదులుతారా అనే ఆసక్తితో అందరూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Related image
ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. ఇక మెగా హీరోల టీజర్లపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ‘ధృవ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాంచరణ్ ని తెరపై ఎప్పుడు చూడాలా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు.  చెర్రీ ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ రావడంతో  మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి.  అచ్చమైన పల్లెటూరి కథగా తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రంలో రామ్‌చరణ్, సమంతల లుక్ కొత్తగా కనిపించనుందట.
Image result for rangasthalam stills
మైత్రి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే మెగాభిమానులు డబుల్ బొనంజానే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటించిన 'అఙ్ఞాతవాసి' సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.    ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. జగపతిబాబు కీలకమైన పాత్రను  పోషిస్తోన్న ఈ సినిమాను, మార్చి 30వ తేదీన విడుదల చేయనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: