ఏ వ్యక్తి అయినా ,ఏ సంస్థ అయినా వారి వారి రంగాలలో ఒక స్థానం ఏర్పరచుకొన్న తరువాత వారికి శ్రేయోభిలాషులు ఏర్పడతారు ,కొత్త పరిచయాలు పెరుగుతాయి, శత్రువులు తయారవుతారు అంతకంటే మించి లెక్కలేనన్ని అభిమానులని సొంతంచేసుకుంటారు.ముఖ్యంగా  వినోదం ,క్రీడలు,రాజకీయాల రంగంలోని ప్రముఖులకు ప్రాణమిచ్చే అభిమానులు సైతం ఉంటారు.

Image result for movie fans in india

ఒక్కొక్క అభిమాని తమ తమ అభిమాన వ్యక్తులని ఒక్కొక్క రీతిలో ఆరాధిస్తూ ఉంటారు.కొంతమంది తమ అభిమాన వ్యక్తుల జన్మదినాల రోజున రక్త దానం చేస్తారు ,ఇంకొంతమంది పేదలకు దుస్తులు మరియు ఆహార సామగ్రి ఉచితంగా అందజేస్తారు ,మరికొంతమంది అయితే విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేస్తారు.ఇలా వారి వారి అభిమాన వ్యక్తుల పై అభిమానాన్ని చాటుకొంటారు.మరికొంతమంది ఒక్క అడుగు ముందుకేసి మరీ వారికి దేవాలయాలు కట్టిన సందర్భాలు కూడా మన దేశంలో చాలానే ఉన్నాయి.

Related image

మరి ఇంత చేస్తున్న అభిమానులకి వారి అభిమాన తారలు ఏమీ చేయకుండా ఉంటారా! వాళ్ళు కూడా వారి అభిమానులకు ఆర్థికంగా సహాయం చేయడం ,వారి కుటుంబాలను ఆదుకోవడం ,వారిని వ్యక్తిగతంగా కలిసి వారి కోర్కెను తీర్చడం వంటివి చేస్తూనే ఉంటారు.అయితే అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన అభిమానికి ఏకంగా ఒక ఇల్లును బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకుంది.

Related image

ఇక వివరాలల్లోకి వెళితే అమెరికాలో నివసించే స్టెఫానీ కి పాప్ సంగీతం అంటే చాలా ఇష్టం.ఆమె గర్భిణిగా ఉన్న  సమయంలో కుటుంబ సమస్యలతో పాటు ఆమె భర్త ఉద్యోగం కూడా పోయింది,వారి ఆర్థిక స్తోమత కూడా బాగాలేకపోడంతో వారి ఇల్లును కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకనాడు మాంచెస్టర్ లో టేలర్ స్విఫ్ట్ షోకి ఆమె హాజరవడంతో పాటు ఆమెను ఏకాంతంగా కలిసే అదృష్టాన్ని కూడా పొందింది. అలా ఏకాంతగా కలిసిన ఆమెను టేలర్ స్విఫ్ట్ ఏం కావాలో చెప్పు అని అడిగింది ,అందుకు ఆమె తన పరిస్థితులను గూర్చి తెలిపింది .అప్పుడు ఆమె వెంటనే ఇల్లు కొనుక్కోవడానికి సరిపడా డబ్బు చెల్లించడమేగాక అందుకు ఏర్పాట్లు కూడా చేసింది అంటూ స్టెఫానీ ఇంటర్నెట్ లో పోస్ట్ చేసింది.దీనితో టేలర్ స్విఫ్ట్ ను నెటిజన్లు అభినందిస్తూ ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: