కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అంటూ వారం వారం సందడి చేసే ప్రదీప్ ఇప్పుడు టచ్ లో లేకుండా పోయాడు. దీంతో ప్రదీప్ ఆచూకీ ఎక్కడా.. అంటూ ఆరా తీయడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా మీడియాలో ప్రదీప్ ఆచూకీ లేదంటూ వార్తలు వెల్లువెత్తున్నాయి. వాస్తవానికి ప్రదీప్ కూడా కౌన్సెలింగ్ కు హాజరుకాకుండా మరింత టెన్షన్ పెడుతున్నాడు.

Image result for anchor pradeep

డిసెంబర్ 31వ రోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు ప్రదీప్. అయితే ఆరోజు వెహికల్ ను వదిలేసి వెళ్లిపోయాడు. వెహికల్ ను పోలీసులు సీజ్ చేసారు. ప్రదీప్ ను కౌన్సెలింగ్ కు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు. 5వ తేదీలోపు ప్రదీప్ తల్లిదండ్రులతో కలిసి కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి ఉంటుంది. తాగి వాహనం నడపడం ద్వారా కలిగే నష్టాలను తల్లిదండ్రుల సమక్షంలో ప్రదీప్ కు వివరిస్తారు. అలా నష్టపోయినవారిని ఎగ్జాంపుల్స్ గా వీడియోలు చూపిస్తారు.

Image result for anchor pradeep

డ్రంక్ డ్రైవ్ లో చాలా మంది గతంలో పట్టుబడ్డారు. అదేమంత తీవ్రమైన నేరం కాదు. కౌన్సెలింగ్ కు హాజరైతే సరిపోతుంది. అయితే ప్రదీప్ మోతాదుకు మించి తాగడంతో శిక్షపడుతుందేమోననే భయం అతడికి ఉన్నట్టుంది. అందుకే ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరిగుపుతున్నాడు. కేవలం కౌన్సెలింగ్ కు మాత్రమే హాజరయ్యే పరిస్థితి ఉంటే బహుశా ప్రదీప్ ఎప్పుడో హాజరయ్యేవాడేమో..!

Image result for anchor pradeep

తాగి పట్టుబడి జైలుకు వెళ్లాడనే పేరును బహుశా ప్రదీప్ ఊహించుకోలేకపోతున్నట్టుంది. పైగా బుల్లితెరపై నీతులు వల్లించే ప్రదీప్ ఇప్పుడు తానే శిక్ష అనుభవించాల్సి వస్తుండడంతో బెదిరిపోయినట్లున్నాడు. అందుకే తప్పించుక తిరుగుతున్నాడు. అవమానం భరించలేక ప్రదీప్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకొన్నాళ్లు ప్రదీప్ కనిపించకపోతే బహుశా మరిన్ని వార్తలు వినాల్సి వస్తుందేమో.! అందుకే.. ప్రదీప్ త్వరగా టచ్ లోకి వచ్చేయ్..!!


మరింత సమాచారం తెలుసుకోండి: