పవన్ కల్యాణ్ – కత్తి మహేశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన కత్తి మహేశ్ మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ – పూనం కౌర్ మధ్య ఏదో ఉందంటూ వెల్లడించారు. పవన్ కల్యాణ్ వల్లే పూనం కౌర్ కు బ్రాండ్ అంబాసిడర్ పదవి వచ్చిందని పరోక్షంగా చెప్పారు. అంతటితో ఆగని కత్తి మహేశ్.. పూనం కౌర్ కు 6 ప్రశ్నలు సంధించారు. అవేంటంటే..

Image result for poonam kaur

  1. ఏపీ చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి మీకు ఎవరి వల్ల వచ్చింది?
  2. తిరుమలలో పవన్ పక్కన నిల్చొని ఒకే గోత్రనామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారు.?
  3. పవన్ మోసం చేశాడనే బాధతో మీరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడంది ఎవరు? మీరు ఏ ఆసుపత్రిలో ఉన్నారు..? మీ బిల్లులో కట్టిందెవరు..?
  4. పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు..? ఇప్పటివరకూ అది నెరవేర్చారా.. లేదా..?
  5. డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం..?
  6. క్షుద్రమాంత్రికుడు చేసిన పూజల్లో త్రివిక్రమ్, పవన్, మీరు ఎందుకు పాల్గొన్నారు..? అక్కడ మీరు ఏం చేశారు?


పవన్ కల్యాణ్ – కత్తి మహేశ్ మధ్య మాటల యుద్ధం లోకి పూనం కౌర్ ఎంటరయ్యారు. ఫ్యాట్సో అంటూ కత్తి మహేశ్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో చేసిన కొన్ని కామెంట్స్ ఆయనకు కోపం తెప్పించాయి. అందుకే కత్తి మహేశ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ పూనం కౌర్ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో పోరాడుతున్న కత్తి మహేశ్.. ఇప్పుడు పూనం కౌర్ ను కూడా తన ఎటాకింగ్ జాబితాలో చేర్చారు. మరి ఈ ప్రశ్నలకు పూనం కౌర్ సమాధానం చెప్తుందా..? చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందనేది తెలియాలి..!


మరింత సమాచారం తెలుసుకోండి: