పవన్ కళ్యాణ్ 25వ సినిమా అజ్ఞాతవాసి థియేటర్లలో సందడి చేస్తోంది. అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ లో.. ఉదయం నుంచి తెలంగాణలో థియేటర్లన్నీ అజ్ఞాతవాసితో నిండిపోయాయి. ఓ వైపు కత్తి మహేశ్, మరోవైపు కోటేశ్వరరావు వివాదాలతో అజ్ఞాతవాసి ఎలాంటి మలుపు తిరుగుతుందోననే అనుమానాలు తలెత్తాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అజ్ఞాతవాసి కలెక్షన్లలో సరికొత్త రికార్డులకు చేరవవుతున్నాడు.

Image result for agnathavasi

ఆంధ్రప్రదేశ్ లో అర్థరాత్రి ఒంటిగంటకే షో మొదలైంది. వారం రోజుల ముందే ఈ టికెట్లన్నీ బుక్కయిపోయాయి. అజ్ఞాతవాసిని ప్రత్యేకంగా పరిగణించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 7 షోలకు అనుమతించింది. దీంతో రోజంతా షోలు ప్రదర్శించుకునేందుకు థియేటర్లకు వెసులుబాటు చిక్కింది. అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో థియేటర్లు పోటీ పడుతున్నాయి. ప్రత్యేక షోలు వేసి కలెక్షన్లు రాబట్టుకుంటున్నాయి.

Image result for agnathavasi

అర్ధరాత్రి తొలి షో నుంచే అజ్ఞాతవాసి సూపరి హిట్ టాక్ తెచ్చుకుంటోంది. సాధారణంగా మిడ్ నైట్ షోలంటే కేవలం అభిమానులే వెళ్తారు. అయితే ఇందుకు భిన్నంగా అర్ధరాత్రి షోలకు ఆడవాళ్లు కూడా తరలిరావడం ఆశ్చర్యం కలిగించింది. కేవలం ఏ సెంటర్లలోనే కాదు.. సి సెంటర్లలో కూడా థియేటర్లలో అర్ధరాత్రి ఆడవాళ్లు కనిపించారంటే అజ్ఞాతవాసి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Image result for agnathavasi

అజ్ఞాతవాసికి ముందు పవన్ కల్యాణ్ పై కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు, మరోవైపు ఆ సినిమా కాపీక్యాట్ అంటూ విమర్శలు, కొడకా కోటేశ్వరరావు సాంగ్ పై వివాదం.. ఇలా ఒకటేమిటి.. అన్నీ చిక్కుముళ్లే.! అయితే ప్రేక్షకులు అవేవీ పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ కు పూర్తి మద్దతు ప్రకటించి థియేటర్లకు తరలివచ్చారు. మరోవైపు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమా ప్రమోషన్ కు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. రోజుకో ఇష్యూతో దీన్ని ప్రజల్లో ఉంచేందుకు ప్రయత్నించారు. దీంతో సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది. పవన్ కల్యాణ్ చిలిపి చేష్టలకు థియేటర్లలో ఈలలు మార్మోగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: