భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' తీవ్ర నిరాశపరిచింది. దీనికి కారణం చాలా వరకు త్రివిక్రమ్ అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ తీసిన గత సినిమాలకు 'అజ్ఞాతవాసి' సినిమాకు చాలా వ్యత్యాసం కనబడుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ పెన్ పవర్ తగ్గిందని చెప్పవచ్చు..దాదాపు ప్రతి సీన్ లో త్రివిక్రమ్ నిర్లక్ష్యం కనబడుతుంది, `నేనేం రాస్తే అదే.. పంచ్‌.. అదే డైలాగ్` అనుకుంటే అంత‌కంటే మూర్ఖ‌త్వం మ‌రోటి క‌నిపించ‌దు. త్రివిక్ర‌మ్‌లో అదే లోపం.

ఇప్పటిదాకా త్రివిక్రం తీసిన ప్రతి సినిమా ఆయన రాసిన ఫైనల్ అయిపోయేది ఆయ‌న‌కు స‌ల‌హా ఇచ్చేవాళ్లు త‌న పక్క‌న లేరు. ఉన్నా… వాళ్ల ఆలోచ‌న‌లు త్రివిక్ర‌మ్‌కి అక్క‌ర లేదు. మ‌నం రాసిందే వేదం అనే స్థాయిలో ’అజ్ఞాతవాసి’ సినిమా ఉంది...ఇందులో పవన్ కళ్యాణ్ నటన విశ్వరూపం చూస్తారు అని ఆడియో ఫంక్షన్లలో చెప్పిన త్రివిక్రమ్, తెరమీద పవన్ కళ్యాణ్ ను పూర్తి భిన్నంగా చూపించారు.

ప‌వ‌న్ తో అల్ల‌రి చిల్ల‌ర వేషాలు వేయించ‌డం, అమ్మాయిలా ఫోన్లో మాట్లాడించ‌డం.. ఇవ‌న్నీ చాలా ఓవ‌ర్‌గా టూమ‌చ్‌గా అనిపించాయి. ఆఖ‌రికి ప‌వ‌న్ అభిమానుల‌కు స‌హా. ఖచ్చితంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో పవన్ కళ్యాణ్ తల దూర్చాడు అన్న విషయం సినిమా చూస్తుంటే తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ ఎందుకు ఒప్పుకున్నాడు? సినిమా లో మాటలు చూసినా త్రివిక్రమ్ రాశాడా? అన్న సందేహం కలుగుతుంది. మొత్తం మీద పూర్తిగా 'అజ్ఞాతవాసి' సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి అజ్ఞానంగా నిర్లక్ష్యంగా తీశాడనే అనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: