పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అజ్ఞాతవాసి నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తోనే సంచలనాలు మొదలు పెట్టిన అజ్ఞాతవాసి సినిమా ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్స్ తో వసూళ్ల హంగామా సృష్టిస్తుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసింది. అన్ని ఏరియాలు కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల దాకా బిజినెస్ చేసింది. నైజాం లో 28.5 కోట్లు.. ఆధ్రా అన్ని ఏరియాలు కలిపి 63 కోట్లు కర్ణాటక 11 కోట్లు అన్ని కలిపి సినిమా 125 కోట్లు చేసింది.


ఓవర్సీస్ లో 19.5 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మొదటి రోజులోనే 9 కోట్ల దాకా రాబట్టింది. ఇక ఈ సినిమా 125 కోట్ల పైన తెస్తేనే సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టు అంతకుమించి తగ్గితే మాత్రం మళ్లీ నష్టాలు వచ్చినట్టే. సినిమా టాక్ ప్రకారం అంత కష్టమని తెలుస్తున్నా వరుస హాలీడేస్ వచ్చాయి కాబట్టి సినిమా వసూళ్లు బాగుంటాయని ఆశిస్తున్నారు.


ఈ సంక్రాంతికి పండుగ తెచ్చే సినిమా అజ్ఞాతవాసి అవుతుందని ఆశించారు కాని సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. కథ కథనాలు మాత్రమే కాదు త్రివిక్రం మార్క్ ఎక్కడ కనిపించలేదు. మరి సినిమా వైఫల్యాన్ని ఎలా కాలిక్యులేట్ చేసుకుంటారో ఏమో కాని పవన్ కళ్యాణ్ కన్నా త్రివిక్రం కు ఇది పెద్ద షాక్ ఇస్తుందని అంటున్నారు. అఆ సినిమానే ఏదో అలా ఆడేసింది అంటూ ఆయన మీద కామెంట్లు విసురుతున్నారు.


మరి టార్గెట్ పెద్దదే సినిమా తాకేమో మాములుగా ఉంది. కుదిరితే ఈ రెండు రోజుల్లోనే మాక్సిమం లాక్కొచ్చేసేయాలి. ఆ తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఏ ఒక్కటి హిట్ అనిపించుకున్నా అజ్ఞాతవాసికి అడ్డు పడటం ఖాయం. మరి అజ్ఞావాసి అసలు లెక్కల కథ ఎలా ముగుస్తుందో మిగతా సినిమాల ఫలితాలను మీద ఆధారపడి ఉంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: