నిత్య వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏది చేసినా అది సంచలనమే. చేసే ప్రతీ ట్వీటు వివాదాన్ని లేక సంచలనాన్ని సృష్టిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. నా ఇష్టం అనే పుస్తకం ద్వారా తన వ్యక్తిత్వాన్ని, తన ఆలోచనలను పంచుకున్న ఈ శివ దర్శకుడుకి అభిమానులు కూడా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ,నేను ఇంతే ,నా వ్యక్తిత్వం ఇంతే, నా అలవాట్లు ఇంతే, నీ గురించి నేను పట్టించుకోను, నా గురించి నువ్వు పట్టించుకోను అనే సిద్ధాంతం ఈయనది.


సమాజంలో ప్రాభల్యం పొందిన లేక జరిగిన, సమాజంలో మంచి కానీ చెడు కాని తనదైన ముద్రవేసిన వ్యక్తుల లేక సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈయన సినిమాలు తీస్తారన్న విషయం మనకు తెలిసిందే. అందుకు నిదర్శనాలు ఆనాటి ముంబై మారణహోమం నిజంగా ఇలానే జరిగిందా అని తలపించేలా ఈయన తీసిన  26/11 ముంబై అటాక్స్ మరియు వీరప్పన్ నిజంగా ఇలా చేసేవాడా అని మతి భ్రమించేలా తీసిన కిల్లింగ్ వీరప్పన్. అయితే గత నెల కడప రెడ్ల చరిత్ర మీద ఒక వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసి సంచలనానికి, వివాదానికి తెరలేపిన వర్మ ఇప్పుడు ఫేసుబుక్లో ఒక పోస్టు చేసి అందరిని ఆశ్చార్యానికి లోను చేశాడు.

Image result for పోర్న్ స్టార్ తో రామ్ గోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ స్త్రీ లోలుడు అన్న విషయం అందరికీ తేలిసిందే. అయితే ఇప్పుడు ఏకంగా ఒక పోర్న్ స్టార్ తోనే సినిమా చేసేశాడు.ఆమె ఎవరో కాదు మియా మాల్కోవా .గాడ్ ,సెక్స్ అండ్ ట్రూత్ టైటిల్ పేరుతో ఎప్పుడు సినిమాని పూర్తి చేశాడో కాని ఏకంగా పేస్ బుక్ లో సినిమా పేరుతో ఒక బోల్డ్ ఫొటోను పోస్టు చేశాడు.నగ్నముగా ఉన్న ఆమెకు  సీన్ వివరిస్తున్నట్లుగా ఆ ఫొటో ఉంది .అంతే కాకుండా సినిమాకు సంబందించిన ట్రైలర్ ను ఈ నెల 16 న ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేస్తున్నట్లు కూడా అందులో పేర్కొన్నాడు. మరి ఈ ట్రైలర్ ఎన్ని వివాదాలను సృష్టిస్తుందో ఏమో..!


మరింత సమాచారం తెలుసుకోండి: