పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ అజ్ఞాతవాసి. ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని తెలిసిందే. త్రివిక్రం మార్క్ ఎక్కడ కనిపించని ఈ సినిమాపై బీభత్సమైన అంచనాలు ఉండటంతో సినిమా మీద బాగా దెబ్బ పడింది. అయితే సినిమా కలక్షన్స్ మాత్రం టాక్ తో సంబంధం లేకుండా ఉండటంతో కాస్త బెటర్ అనిపిస్తుంది.


ఇక ఈ సినిమాకు మ్యూజిక్ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా సరే అనిరుద్ తెలుగు ప్రేక్షకుల నాడి పట్టుకోలేదు అన్నది కొంతమంది మాట. అనిరుద్ ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. సాంగ్స్ బాగున్నాయ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే కాని సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పవన్, త్రివిక్రం, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే సూపర్ హిట్ అనాల్సిందే.


జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు కథ కథనాలతో పాటుగా సినిమా మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. అందుకే ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాల్లో మ్యూజిక్ ప్రముఖ పాత్ర వహించిందని చెప్పొచ్చు. మరి ఈసారి ఎందుకు దేవిని కాదని అనిరుద్ ను తీసుకున్నారో కాని సినిమా సంగీతం కాస్త అటు ఇటుగా ఉంది. అనిరుద్ తక్కువోడేం కాకపోయినా ఈ ఇద్దరి కాంబోకి స్పెషల్ థీం మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు.


అయితే అనిరుద్ స్టైల్ నచ్చి అతన్ని ఎన్.టి.ఆర్ సినిమాకు తీసుకున్నాడు త్రివిక్రం. అజ్ఞాతవాసి టార్గెట్ మిస్ అయినా సరే కచ్చితంగా త్రివిక్రం మళ్లీ ఎన్.టి.ఆర్ సినిమాతో ట్రాక్ ఎక్కేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో డైలాగ్స్ కొన్నైనా సరే వాటితో తన పెన్ పవర్ ఏంటో చూపించిన త్రివిక్రం అజ్ఞాతవాసి ఫలితం చూసి ఎన్.టి.ఆర్ సినిమాకు మరింత జాగ్రత్త పడతాడని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: