సినిమా హీరోలంటే తామేమి ఆకాశంలోంచి ఊడి పడలేదు అన్న ఆలోచన ఉంటే చాలు.. ప్రతిభ ఎంత ఉన్నా ఓ అదృష్టం తమని హీరోగా చేసిందని నమ్మాలి. అయితే కొందరు హీరోలు నిజంగానే తామేదో గొప్ప అన్నట్టు ఉంటారు. ఫ్యాన్స్ అంటూ వచ్చిన వారిని కూడా అంత మంచి రెస్పాన్స్ ఇవ్వరు. ఫ్యాన్స్ ఇరిటేట్ చేస్తే వారికి తగిన పనిష్మెంట్ ఇస్తారు. అయితే తమిళ నటుడు సూర్య అలా కాదు ఫ్యాన్స్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాడు.


సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా తానా సేంద కూట్టం. ఈ సినిమా ప్రీ రిలీజ్  ఫంక్షన్ లో సూర్య తన ఫ్యాన్స్ కు అరుదైన గౌరవం ఇచ్చారు. స్టార్ హీరోని అభిమానించే అభిమానులు అతన్ని దేవుడిగా చూస్తారు. అందుకే కొందరు అభిమానులు హీరో కనబడగానే కాళ్ల మీద పడతారు. అదే సీన్ సూర్య సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో జరిగింది.


సూర్య వేదిక మీద మాట్లాడుతుంటే ఒక్కసారిగా అతని దగ్గరకు ఓ నలుగురు ఐదుగురు ఫ్యాన్స్ వచ్చారు. వచ్చి రావడమే అతని కాళ్ల మీద పడి నమస్కారం చేశారు. అయితే సూర్య కూడా తన కాళ్ల మీద పడిన అభిమానికి వంగి అతని కాళ్ల టచ్ చేశాడు. ఇక నుండి అలా చేయొద్ధని చెప్పాడు. సూర్య మంచి మనసుని తెలియచేసేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ దొరకదేమో.


తెలుగులో కూడా ఈ సినిమా గ్యాంగ్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కీర్తి సురేష్ నటించగా ఆ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందించాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: