అక్కినేని ఇంటి వారి కోడలు నాగచైతన్య భార్య అయిన హీరోయిన్ సమంత మంచి మనస్సున్నఅమ్మాయే కాక తన భావాలను నిర్మొహమాటంగా వ్యక్తపరచడంలో ఏమాత్రం సంకోచించని అమ్మాయి. తాజాగా ఆమె తన చిన్ననాటి జ్ఞాపకాలను భగవంతుని మీద ఉన్న నమ్మకాన్ని తెలియపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. మా ఇంట్లో వారు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాలలో క్రమం తప్పకుండా చర్చికి వెళ్లేవారు నేను వెళ్లేదాన్ని నాకు ఇష్టం లేకున్నా మా అమ్మ బలవంతంగా తీసుకుని వెళ్లేది.

ఆ సమయంలో నాకు చాలా బోర్  అనిపించేది.కానీ ప్రస్తుతం నా జీవితం చూస్తే  ఆమె చేసిన ప్రార్థనే నాకు మంచి చేశాయని అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు ఆ సమయంలో పరీక్ష రాయాల్సి వచ్చింది.

పరీక్షలు రాయడానికి కూడా నాకు ఆ సందర్భంలో ఓపిక కూడా లేదు అటువంటి సమయంలో మా అమ్మ నాకు తోడుగా రావడంతో ధైర్యంగా పరీక్షలు రాయగలిగాను. మై మామ్ ఈజ్ రియల్లీ అమేజింగ్ అని చెప్పుకొచ్చింది. నిజంగా దేవుడున్నాడా లేడా ని పక్కన పెడితే భగవంతునిపై భారం అనేది మానసిక ధైర్యాన్ని ఇస్తుంది అని ఆమె చెప్పిన విధానం అమేజింగ్. ప్రస్తుతం సమంత మూడు సినిమాలలో నటిస్తుంది ..ఈ సినిమాలన్నీ మార్చి చివరికల్లా విడుదలవడానికి సిద్ధంగా ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: