మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ సినిమా టీజర్ డేట్ ఎనౌన్స్ చేసి మెగా ఫ్యాన్స్ ఉత్సాహం నింపేలా చేశారు చిత్రయూనిట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ నెల 24 సాయంత్రం 4:15 గం.లకు రిలీజ్ చేస్తారట. 


పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో రాం చరణ్ కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మార్చి 30న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా రేంజ్ ఏంటన్నది చూపించిన సుకుమార్ ఈ సినిమాతో చరణ్ కు సూపర్ హిట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. రిలీజ్ అయిన పోస్టర్ సినిమా మెగా ఫ్యాన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.


ఇక టీజర్ తో మరింత అంచనాలను పెంచేలా చేస్తున్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పూజా హెగ్దె ఐటం సాంగ్ చేస్తున్న ఈ సినిమాలో హాట్ యాంకర్ అనసూయ కూడా నటిస్తుందని తెలుస్తుంది. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా రాం చరణ్ కు ప్రత్యేక ఇమేజ్ తెస్తుందని అంటున్నారు.


సినిమాలో చరణ్ నటన కచ్చితంగా ఫ్యాన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. అంచనాలను అందుకుంటే మాత్రం సినిమా మరో సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: