అజ్ఞాత వాసి ఫ్లాప్ కి కారణాలు వెతికే పనిలో చాలా మంది ఉన్నారు. అసలు త్రివిక్రమ్ ఇంత చెత్తగా తీయడానికి అసలు రీజన్ ఏంటి అని అందరు అనుకుంటున్న వేళా ఒక ఆసక్తి కరమైన న్యూస్ బయటికి వచ్చింది. అదేమిటంటే సినిమా కంటే ఒక రెండు గంటలు ఎక్కువ నిడివిని షూట్ చేయడం. ఏ సినిమాకు అయినా స్క్రిప్ట్ కు అదనంగా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ఎక్కువ షూట్ చేసారు. ఏ ఒకరిద్దరో మాత్రమే అతి తక్కువ వేస్టేజ్ తో మేనేజ్ చేస్తారు.

Image result for pavan kalyan

అయితే త్రివిక్రమ్, సుకుమార్ లాంటి మేధావి వర్గ దర్శకులు మాత్రం, ముఫై నుంచి నలభై శాతం వరకు అదనంగా తీస్తారు. అంతా ఎడాపెడా తీసేసి, ఆఖరికి ఎడిటింగ్ టేబుల్ దగ్గర కుస్తీ పడతారు. అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ తీసిన ఫుటేజ్ నాలుగు గంటల వరకు వచ్చినట్లు బోగట్టా. ఆ నాలుగు గంటల పుటేజ్ ను దగ్గర దగ్గర మూడు గంటలు చేసారు. అంటే గంట ఫుటేజ్ పక్కన పెట్టేసారు. గంట ఫుటేజ్ అంటే చిన్న విషయం కాదు. ఎన్ని సీన్లు వుంటాయో? ఎంత కీలకమైన సీన్లు వుంటాయో? ఆలోచిస్తేనే ఆసక్తిగా అనిపిస్తుంది.

Image result for pavan kalyan

అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, జనవరి 9డేట్ ప్రకటించేసిన తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు త్రివిక్రమ్ చాలా కిందా మీదా అయిపోవాల్సి వచ్చింది ముంబాయిలో డిఐ, గ్రాఫిక్స్.. చెన్నయ్ లో రీ రికార్డింగ్, డిటీఎస్ మిక్సింగ్, హైదరాబాద్ లో ఎడిటింగ్. వీటిలో త్రివిక్రమ్ ఎక్కువ సమయం కేటాయించింది చెన్నయ్ లో రీ రికార్డింగ్ కు, డిటీఎస్ మిక్సింగ్ కు. ఆ పనిలో పడి ఇటు ఎడిటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టలేదని తెలిసింది. త్రివిక్రమ్ నెరేషన్, సూచనల ప్రకారం ఎడిట్ చేసి పెట్టేసినట్లు తెలుస్తోంది. దీనితో మొదటికే మోసం వచ్చింది.  సినిమాలో కాస్త కంటిన్యూటీ సమస్యలు, పాత్రలకు పరిపూర్ణ ఎండింగ్ వంటి సమస్యలు తలెత్తాయి. దీనితో ఫలితం ఏమైందో మనకందరికీ తెలిసిందే...!


మరింత సమాచారం తెలుసుకోండి: