అజ్ఞాత వాసి సినిమా మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నది. దీనితో ఈ సినిమా కి నష్టాలు తప్పవని అందరు భావించారు. అయితే పవన్ మ్యానియా అంతో, ఇంతో పని చేస్తుందని అందరు అనుకున్నారు.అది కూడా సంక్రాంతి కావడం తో కొద్ది పాటి నష్టాలతో బయట పడొచ్చు అని అందరు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కలెక్షన్స్ చూస్తుంటే అందరికి హార్ట్ ఎటాక్ తప్పడం లేదు. 'అజ్ఞాతవాసి' సినిమాకు భారీగా నష్టపోయేది నైజాం డిస్ట్రిబ్యూటరే అంటున్నారు.

Image result for agnathavasi images

నైజాంలో ఈ చిత్రాన్ని రూ. 27కోట్ల పై చిలుకు ధరకు అమ్మారు. తొలి 6రోజుల్లో ఈచిత్రం ఇక్కడ కేవలం రూ. 10కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. సంక్రాంతి పండగ సీజన్ కూడా ముగియడంతో ఇకపై వసూళ్లు మరింత పడిపోవడం ఖాయం అని పలువురు అనుకుంటున్నారు.  సీడెడ్ ఏరియాలో అజ్ఞాతవాసి రైట్స్ రూ. 15కోట్ల పై చిలుకు అమ్మారు. అయితే ఇక్కడ తొలి 6రోజుల్లో కేవలం రూ. 4.75 కోట్లు మాత్రమే వసూలైంది. దీంతో ఈ ఏరియా డిస్ట్రిబ్యూటర్ కూడా భారీగా నష్టం తప్పేట్లు లేదు. అజ్ఞాతవాసి నెల్లూరు రైట్స్ రూ. 4కోట్ల పై చిలుకు అమ్మారు.

Image result for agnathavasi images

అయితే తొలి 6 రోజుల్లో ఇక్కడ రూ. 2.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇక్కడ కూడా భారీ నష్టమే అంటున్నారు. గుంటూరు ఏరియాకు గాను అజ్ఞాతవాసి రైట్స్ రూ. 9కోట్లకు అమ్మినట్లు సమాచారం. అయితే ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 4.81 కోట్లు మాత్రమే వసూలైంది.  కృష్ణ ఏరియా రైట్స్ దాదాపు దాదాపు రూ. 7కోట్ల వరకు అమ్మినట్లు సమాచారం. ఇక్కడ తొలి 6 రోజుల్లో రూ. 2.8 కోట్లు మాత్రమే వసూలైంది. దీని బట్టి అందరికి అర్ధం అయ్యింది సినిమా బాగుంటేనే ప్రేక్షకలు చూస్తారని బాగాలేక పోతే పవర్ స్టార్ కాదు కదా సూపర్ స్టార్ ఉన్న చూడరు అని నిరూపించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: