తెలుగు వాడు అంటే ఇదీ,తెలుగు వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించిన ఘనత విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారికే దక్కుతుంది. దేశంలో ఎన్ని సినిమా ఇండస్ట్రీలు ఉన్నా తెలుగు సినిమా పరిశ్రమను,తెలుగు నటులను గౌరవిస్తున్నారంటే ఆనాడు రామారావు గారు వంటి పెద్దలు చేసిన కృషి అని చెప్పవచ్చు. సినిమాలనుండి మొదలైన ఆయన ప్రస్థానం ఆ తరువాత రాజకీయాల వరకు ఆయన ఎదిగిన వైనం అందరికీ ఆదర్శప్రాయమే.


మహానుభావుల లేక ఒక రంగంలోని వ్యక్తులు చేసిన కృషిని,వారు జీవితంలో పడిన కష్టాలను, చీకటి తెరను తెలియజేస్తూ వెండి తెరమీద చూపించే బయోపిక్ లకు ఈ కాలంలో మంచి క్రేజ్ ఉంది. అందులోనూ రామారావు గారి జీవిత చరిత్ర అంటే ఎవరు చూడరు! ఇప్పటికే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ పేరుతోనూ, ఆయన శిష్యుడు తేజ బాలయ్య హీరోగానూ ఎన్టీయార్ బయోపిక్లను తెరకెక్కించేందుకు అన్ని సన్నాహకాలు పూర్తి అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ మాత్రం తాను తీయబోయె సినిమాలో రామారావు గారి జీవితంలో జరిగిన అన్ని సంఘటనలని ఖచ్చితంగా చూపిస్తానని శపథం కూడ చేసారు. తను తీయబోయే బయోపిక్ సంబందించి ఒక పోస్టర్ ని కూడా విడుదల చేశాడు. 


కాగా బాలకృష్ణ హీరొగా తీస్తున్న బయోపిక్ లో డైరెక్టర్ ను మార్చారు అని ఎన్ని వదంతులు వచ్చినా చివరికి తేజనే డైరెక్టర్ అని తేలిపోయింది. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పోస్టర్ ను చిత్రబృందం నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేసింది. " ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి "అని ఆనాడు ఎన్టీఆర్ చెప్పిన మాటలను పోస్టర్లో పొందుపరిచారు. ఇది మాత్రం కేవలం టైటిల్ కోసం విడుదుల చేసిన పోస్టర్ మాత్రమే అని  ఫస్ట్ లుక్ లో బాలయ్య లుక్ ని రివీల్ చేస్తామని చిత్రబృందం తెలిపింది. మొదట్లో టైటిల్ కు సంబందించి ఎన్ని వదంతులు వచ్చినా చివరికి ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ నే ఖరారు చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబందించి నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ జీవితం గురించి తెలుసుకోవాలని ప్రజలు  ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: