గత నాలుగు నెలల నుండి పవన్ ఫ్యాన్స్ మరియు సినీ విమర్శకుడు కత్తి మహేష్ ల మధ్య నడుస్తున్న వివాదం గురించి తెలిసిందే. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు అయితే ఇప్పటిలో అనిపించడం లేదు. ఈ నెల 15 వరకు కత్తిని సైలెంట్ గా ఉండమని కోన వెంకట్ కోరాడు. అయితే కోన వెంకట చెప్పిన మాటలకు విలువ ఇచ్చినట్లే  ఇచ్చి మళ్ళీ తన విమర్శల బాణాలను సంధించాడు. ఈ వివాదాన్ని ఎలా ఆపాలిరా అని సినీ పెద్దలు తర్జనభర్జన అవుతుంటే దీనికి వార్తా ఛానెళ్ళు ఆజ్యం పోస్తున్నాయి. వివాదం ముగిస్తుంది అన్న సమయంలో టీఆర్పీ రేటింగ్ కోసం పాకులాడుతాయో లేక వివాదంను పొడిగించాలని అనుకుంటాయో తెలియదుకాని మళ్ళీ కత్తిని ఇంటర్వ్యూ చేసి పరోక్షంగా వివాదాలకు కారణం అవుతున్నాయి.


పవన్ ని అవమానించాడని పవన్ అభిమానులు సాటి పవన్ అభిమానిని చితకబాదిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగి 24 గంటలు గడవకముందే ఇంకో ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఇందులో ఇరుక్కున్నది ఎవరో కాదు స్వయానా కత్తి మహేష్. కత్తిపై హైదరాబాద్‌లోని కొండాపూర్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. నిన్న గురువారం రాత్రి ఒక వార్తా  ఛానెల్  డిబేట్ లో పాల్గొనేందుకు కారులో వెళ్తుండగా కొండాపూర్‌లో కోడి గుడ్లతో చితకొట్టారు. కారు దిగిన వెంటనే కుడి కన్ను కు గుడ్డు  తగలడంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యిన ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు.


ఇది ఖచ్చితంగా పవన్ ఫ్యాన్స్ చేశారు అని ఆయన ఆరోపించారు. పవన్ తన అభిమానులని అదుపులోపెట్టుకోవడం లేదని , ఈ దాడికి కేవలం పవన్ మరియు ఆయన ఫ్యాన్స్ భాద్యత వహించాలని,ఆ విధంగా తాను కేసు పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. కాగా కత్తి  మహేష్ పై దాడిని ఓయూ జేఏసీ తీవ్రంగా ఖండించింది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయబోతున్నట్లు జేఏసీ ప్రతినిధి రవి ఒక ప్రకటనలో తెలిపాడు. అoతేకాకుండా రాష్ట్రంలో పవన్ సినిమాలను ఆడనివ్వబోమని , కత్తి మహేష్ కు తామెప్పుడూ సహాయం చెయ్యడానికి ముందుంటామని ఆయన పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: