మోడల్ గా ఉంటూ ఆ ఫేం తో హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు కృతి సనన్. సంతూర్ యాడ్ నుండి క్లోజప్ యాడ్ వరకు అమ్మడు అందరికి సుపరిచితురాలే. అయితే ఆమె యాడ్స్ ఆపేసి సినిమాలు చేయడం మొదలు పెట్టే సరికి పాపులారిటీ పెరిగింది. మహేష్ పక్కన చేసినా అది నిరాశ పరచడంతో బాలీవుడ్ కు జంప్ అయ్యింది.


ఇక బాలీవుడ్ లో అరకొర అవకాశాలు వస్తున్నా వాటిలో రెచ్చిపోతున్న కృతి ఇప్పుడు ఫోటో షూట్స్ తో దుమ్ముదులిపేస్తుంది. సినిమాలో చేస్తే ఎంత మైలేజ్ వస్తుందో ఫోటో షూట్స్ తో అంతకు డబుల్ క్రేజ్ తెచ్చేసుకుంటున్నారు. వరుసగా ఆఫర్లు రాకున్నా ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది కృతి సనన్. ప్రస్తుతం అమ్మడు డబ్బో క్యాలెండర్ కు హాట్ స్టిల్స్ ఇచ్చింది.


అర్ధ నగ్న ప్రదర్శనే అయినా క్యాప్ తో తన అందాలను కవర్ చేస్తూ.. ఓర చూపులతో రెచ్చిపోతున్న కృతిని చూసి వారెవా అని అననివారు ఉండరు. గ్లామర్ డోస్ పెంచేందుకు నేను రెడీ అంటూ అమ్మడు ఇస్తున్న సిగ్నల్స్ చూస్తుంటే తనని సరిగా వాడుకోవట్లేదని చెప్పొచ్చు. సరైన అవకాశం రావాలే కాని అంటూ అమ్మడు అదరగొడుతుంది.


1 నేనొక్కడినే తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ సినిమా చేసిన కృతి సనన్. ఆ తర్వాత బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. సౌత్ లో సరైన అవకాశాలు లేని అమ్మడు బీ టౌన్ లోనే స్టార్ క్రేజ్ దక్కించుకోవాలని చూస్తుంది. అందుకే ఈ ప్రయత్నాలన్ని అంటున్నారు. మరి అమ్మడు కోరుకునే ఆ క్రేజ్ రాబట్టుకుంటుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: