మాటల మాంత్రికుడు దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ ఫలితం హీరో పవన్ కళ్యాణ్ కంటే డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఎక్కువ నష్టం కలిగించింది అని చెప్పవచ్చు. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల అపజయం కంటే ఈ సినిమా అపజయం త్రివిక్రమ్ కు ఉన్న చరిష్మాకు పెద్ద దెబ్బ తగిలింది అన్నది సుస్పష్టం. మొత్తం మీద చూసుకుంటే త్రివిక్రమ్ కెరీర్ కు మొదటిసారి ఫ్లాప్ పరిచయమైంది అని చెప్పావచ్చు.

అయితే ఈ సినిమాపై  నెలకొన్న వివాదం పై త్రివిక్రమ్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే కాపీ వివాదం. అజ్ఞాతవాసి సినిమా స్టోరీలైన్ ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్’ సినిమా నుండి దించారని విడుదలకు ముందు రుమార్స్ వచ్చాయి. విడుదల తర్వాత అవి రూమర్స్ కాదని, నిజమేనని తేలింది. ఎంతో మేధా సంపత్తి కలిగిన రచయిత  త్రివిక్రమ్ తన సినిమా  స్టోరీలైన్ పరాయి భాష నుంచి తీసుకోవడం ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

టాలీవుడ్ కు మరో జంద్యాల అని ఒక క్రమంలో పేరు సంపాదించుకున్నత్రివిక్రమ్ ఇలా కాపీ వివాదంలోకి రావడం ఆయన అభిమానులకు ఎదోలా వుంది. ఇంటర్నేషనల్ గా ఈ సినిమా మీద త్వరలో లార్గో వించ్ దర్శకుడు దావా వెయ్యబోతున్నాడు ..దీంతో ఇంకెక్కడి అభినవ జంధ్యాల ఆ పేరు పీకెయ్యండి అంటున్నారు తెలుగు సినిమా ప్రియులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: