ఫ్లాపులు వస్తున్నా స్టార్ హీరో సినిమా అంటే సంచలనాలు షురూ చేయడం పక్కా.. ఈ విషయాన్ని తను చేస్తున్న భరత్ అను నేను సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు మహేష్. ఫలితాలతో సంబందం లేకుండా సినిమా రేంజ్ పెంచుకుంటూ వస్తున్న మహేష్ చేస్తున్న భరత్ అను నేను సినిమాతో కొత్త రికార్డులను సృష్టించింది. 


శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమా అప్పుడే రికార్డ్ ప్రైజ్ లో శాటిలైట్ అవడం విశేషం. ఈ సినిమా తెలుగు, హింది విషయంలో ఏకంగా 39 కోట్లకు కొనేశారని టాక్. స్టార్ మా తెలుగు, హింది శాటిలైట్ రైట్స్ దక్కించుకుందట. తెలుగు వర్షన్ కు 23 కోట్లు.. హింది వర్షన్ కు 16 కోట్లు లెక్క తేలినట్టు.


మహేష్ కెరియర్ లో ఈ రేంజ్ లో శాటిలైట్ అయిన ఈ సినిమా ఇదే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ సిఎం గా కనిపించబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా ప్రీ రిలీజ్ లో రికార్డులు సృష్టిస్తున్న మహేష్ సినిమాతో కచ్చితంగా సూపర్ హిట్ కొట్టేస్తాడని అంటున్నారు. 


బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు అంచనాలు అందుకోకపోవడంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ పై మరింత జాగ్రత్త పడుతున్నాడు మహేష్. ఏప్రిల్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అనుకున్న డేట్ కు రాకుంటే సినిమా జూన్ కు వాయిదా పడే అవకాశాలున్నాయట.



మరింత సమాచారం తెలుసుకోండి: