ఇంకా కొంతమంది హీరోల సినిమాల కలక్షన్స్ 50 కోట్లు అంటే అందని ద్రాక్షలా ఉంటే ఏకంగా తీసిన సినిమా ఫలితంతో సంబంధం లేకుండా 50 కోట్ల కలక్షన్స్ తో బాక్సాఫీస్ పై తనకున్న సత్తా చూపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రీసెంట్ గా సంక్రాంతి బరిలో త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అజ్ఞాతవాసి టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ 50 కోట్లు దాటేశాయి.


ఇక ఈ సినిమాతో 5 సినిమాలు 50 కోట్లు దాటించిన హీరోగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన రికార్డ్ దక్కించుకున్నాడు. పవన్ నటించిన గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలు 50 కోట్లు దాటాయి. ఇప్పుడు అజ్ఞాతవాసితో కలుపుకుని 5 సార్లు ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి హీరోగా పవన్ కళ్యాణ్ అదిరిపోయే రికార్డ్ కొట్టాడు.


ఇక పవన్ కళ్యాణ్ తర్వాత అల్లు అర్జున్ కూడా 5 సినిమాల్లో 50 కోట్లు సాధించాడు. అయితే అల్లు అర్జున్ సోలోగా చేసిన సినిమాల లెక్క చూస్తే కేవలం 4 సినిమాలు మాత్రమే వస్తాయి. రుద్రమదేవి లో గోన గన్న్నారెడ్డి పాత్ర లెక్కలో వేసుకుంటే ఆ సినిమాతో కలిపి 5 సినిమాలు 50 కోట్ల మార్క్ వచ్చినట్టు అవుతుంది. 


స్టార్ సినిమా అంటే 50 కోట్లు రెండు రోజుల్లోనే వచ్చేస్తున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ 50 కోట్లు సాధించిన ఈ సినిమాలు చూస్తే అందులో రెండు మాత్రమే హిట్లు మిగతావన్ని ఫ్లాపులు.. మరి ఫ్లాపులతోనే ఈ రేంజ్ కలక్షన్స్ వస్తుంటే హిట్టు కొడితే ఎలా ఉంటుంది అంటూ కొందరు అంచనాలేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: