లాస్ట్ ఇయర్ సెన్సేషనల్ మూవీస్ లో అర్జున్ రెడ్డి ఒకటి. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడయ్యాయి. ప్రస్తుతం తమిళ రీమేక్ ఏర్పాట్లు మొదలయ్యాయి.


తమిళ అర్జున్ రెడ్డి సినిమాకు వర్మ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. బాలా డైరక్షన్ లో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాపై విక్రం తన అభిప్రాయాన్ని చెప్పాడు. అర్జున్ రెడ్డి సినిమా తనకు ఎంతగానో నచ్చిందని.. ధ్రువ్ చేయకుంటే తానే ఈ సినిమా చేసేవాడినని అన్నాడు.


తనయుడిని హీరోగా మరో మూడేళ్ల తర్వాత ప్రమోట్ చేద్దామని అనుకోగా అర్జున్ రెడ్డి కథకు ధ్రువ్ బాగుంటాడని నిర్మాతలు అడగడంతో ఓకే చెప్పానని అన్నాడు విక్రం. అర్జున్ రెడ్డితో విజయ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో మొదటి సినిమానే అలాంటి ప్రయోగం చేస్తున్న ధ్రువ్ కచ్చితంగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటాడని అనిపిస్తుంది.


బాలా సినిమా అంటే ఇక సినిమాకు కొన్ని ప్రత్యేకమైన బలమైన సన్నివేశాలతో మనసుకి హత్తుకునేలా చేస్తాడు. మరి తెలుగులో ఓ రేంజ్ లో హిట్ అయిన అర్జున్ రెడ్డి తమిళంలో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ధ్రువ్ పర్ఫెక్ట్ ఎంట్రీ ఈ సినిమా అవుతుందని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: