మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వి.వి.వినాయక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఇంటిలిజెంట్.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. తిక్క, విన్నర్, జవాన్ ఇలా వరుసగా అభిమానులను నిరాశ పరుస్తున్న సాయి ధరం తేజ్ మొదటిసారి స్టార్ డైరక్టర్ వినాయక్ తో చేస్తున్న సినిమా ఈ ఇంటిలిజెంట్.


ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో తేజ్ సీరియస్ లుక్ చూస్తుంటే వినాయక్ తేజ్ ను ఎంత యాక్షన్ హీరోగా చూపించాడో అర్ధమవుతుంది. ఇక ఇంటిలిజెంట్ ఇంగ్లిష్ టైటిల్ లో కూడా రెండు టిలు పెట్టడం కూడా న్యూమరాలజీ ఫాలోఅవుతున్నారని పీఅర్వో బి.ఏ రాజు రివీల్ చేశాడు. మొత్తానికి మెగా మేనళ్లుడికి హిట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఇంటిలిజెంట్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.


సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆకుల శివ కథ అందించడం జరిగింది. ఈమధ్యనే జై సిం హా అంటూ వచ్చి హిట్ అందుకున్న కళ్యాణ్ తేజ్ సినిమా కూడా పక్కా హిట్ అన్న కాన్ ఫిడెంట్ తో ఉన్నాడట. ఫిబ్రవరి 9న రిలీజ్ అవనున్న ఈ సినిమా తేజ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మెగా కుర్రాడితో వినాయక్ మరో సంచలనం సృష్టించాలానే కసితో ఉన్నాడనిపిస్తుంది.


ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకునేలా ఉంటుందో లేదో చూడాలి. సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తుంది. అమ్మడికి కూడా అర్జెంట్ గా ఓ హిట్ కంపల్సరీ లేదంటే కెరియర్ సందిగ్ధంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: