సంచలన దర్శకుడు తాను ఏం మాట్లాడుతాడో తనకే అర్ధం కాకుండా ఆడియెన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అయితే తను మాట్లాడే ప్రతి మాటకి ఓ లెక్క ఉంటుంది. ప్రస్తుతం వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ మూవీ గురించి వార్తల్లో ఉండగా ఇప్పుడు పూరి సినిమా గురించి మాట్లాడి హాట్ న్యూస్ గా మారాడు.


పూరి డైరక్షన్ లో తనయుడు ఆకాష్ హీరోగా చేస్తున్న సినిమా మెహబూబా. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫట్ కాపీ సిద్ధమైందట. 1971 ఇండో పాక్ యుద్ధం సమయంలో జరిగిన ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా చూసిన వర్మ పూరి కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ అయిన పోకిరి కూడా ఈ సినిమా ముందు ఫ్లాపే అంటున్నాడు.


పూరి లాంటి డైరక్టర్ కసితో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఇండస్ట్రీ రికార్డులను సైతం కొల్లగొట్టిన ఈ డైరక్టర్ ఇప్పుడు వరుస ఫ్లాపులు తీస్తున్నాడు. బాలయ్య పైసా వసూల్ కూడా నిరాశ పరచడంతో ఇక ఇప్పుడు ఆకాష్ తో మెహబూబా అదరగొట్టాలని చూస్తున్నాడు. ఇక వర్మ కూడా సినిమా చూసి ఒరిజినల్ టాక్ చెప్పాడు కాబట్టి పూరి సత్తా ఏంటో మెహబూబా ప్రూవ్ చేస్తుందని అంటున్నారు. 


మెహబూబాపై వర్మ వ్యాఖ్యలకు పూరి సింపుల్ గా గురువు గారికి థ్యాంక్స్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పోకిరి ఫ్లాప్ అన్నందుకు కాదు కాని సినిమా పోకిరితో పోల్చి హిట్ అవుతుందని చెప్పినందుకు పూరి సంతోషంగా ఉండి ఉంటాడు. మరి ఈ సినిమాతో అయినా పూరి హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేడా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: